ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. హీరోయిన్ మోనాల్ గజ్జర్.. ఇప్పుడు ఈమె ఎంతో హాట్ టాపిక్ లా మారిపోయింది...గతంలో తెలుగులో నాలుగైదు సినిమాలు చేసింది. ఆ సినిమాలతో  రాని గుర్తింపు బిగ్ బాస్ షోతో చాలా వేగంగా సంపాదించుకుంది ఈ గుజరాతి హాట్ బ్యూటీ. బిగ్ బాస్ షో తరువాత బిజీగా మారిన కంటెస్టెంట్ ఎవరంటే మోనాల్ పేరే చెప్పాలి. ఓ పక్క సినిమాలు ఒప్పుకుంటూనే టీవీ షోలతో బిజీగా గడుపుతోంది. రీసెంట్ గా విడుదలైన ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో ఐటెం సాంగ్ లో నటించింది ఈ బ్యూటీ. బిగ్ బాస్ షోలో ఉన్నప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఓ వ్యక్తిని ప్రేమించానని.. అతడితో బ్రేకప్ అవ్వడం వలన దక్షిణాది నుండి గుజరాత్ కి వెళ్లిపోయాయని చెప్పింది మోనాల్.

ఆ తరువాత ఎప్పుడూ కూడా తన మాజీ బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పలేదు. కానీ తాజాగా తన బ్రేకప్ సంగతులు చెప్పుకొచ్చింది ఈ  హాట్ బ్యూటీ.ఇక ఈ ముద్దుగుమ్మ పాత ప్రియుడి విషయానికి వస్తే ఆ మహానుభావుడు పేరు ఆర్యన్ అట...ఇతను ఓ మలయాళ ఇండస్ట్రీకి చెందిన హీరో.. తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేసే సమయంలో ఆర్యన్ తో డేటింగ్ చేశానని.. ఐదారేళ్ల పాటు రిలేషన్ లో ఉన్న తరువాత 2016లో బ్రేకప్ అయిందని.. ఆర్యన్ సౌత్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కావడంతో మళ్లీ గుజరాత్ కి వెళ్లిపోయానని చెప్పుకొచ్చింది. బ్రేకప్ వలన డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని.. అందుకే తిరిగి సౌత్ కి రాకూడదని అనుకున్నట్లు చెప్పింది.



2012లో మోనాల్, ఆర్యన్ కలిసి ‘డ్రాకులా’ అనే సినిమాలో నటించారు కూడా.ఈ మలయాళ త్రీడీ సినిమాను తెలుగులో ‘పున్నమిరాత్రి’గా అనువదించారు. 2016లో తెలుగులో ఈ సినిమా విడుదలైంది. ఇందులో శ్రద్ధాదాస్, ప్రభు, నాజర్ లాంటి తారలు కూడా నటించారు. ప్రస్తుతం ఓ ప్రముఖ ఛానల్ లో ప్రసారిమవుతున్న డాన్స్ రియాలిటీ షో కి న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తోంది ఈ హాట్ బ్యూటీ. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి... 

మరింత సమాచారం తెలుసుకోండి: