పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మారే సమయంలో స్వయంగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న సంగతి తెలిసిందే..అంతేకాదు.. తన మార్షల్ ఆర్ట్స్ కారణంతోనే సినిమాలో ఫైట్స్ కూడా అదిరిపోయేలా కంపోజ్ చేసేవాడు. కొన్ని సినిమాలకు యాక్షన్ కొరియోగ్రఫర్ గా కూడా వర్క్ చేసాడు పవన్. మార్షల్ ఆర్ట్స్ అంటే తెలుగులో ఒకప్పుడు సుమన్, భానుచందర్ లాంటి హీరోలు గుర్తొచ్చే వాళ్లు.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఉన్నాడు.ఈయన ఎందుకు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడనే ప్రశ్నకు సమాధానం చాలా మందికి సరిగ్గా తెలియదు.. క్లారిటీ కూడా లేదు.అప్పట్లో పవన్ కు చదువు పెద్దగా ఎక్కలేదు. కానీ లోకజ్ఞానం మాత్రం బోలెడు ఉంది.కేవలం చదువుతో వచ్చిన జ్ఞానం కాదు అది.. ఎన్నో వందల వేల పుస్తకాలు చదివాడు.
 
తనకు అచ్చిరాని చదువును కొంతవరకు మాత్రమే పట్టించుకున్నాడు పవన్ కళ్యాణ్. దాంతో వచ్చిన వరకు చదువుకున్నానని చెప్తుంటాడు కూడా.తనకు ఎందుకో చదువు ఎక్కలేదని.. ఆ తర్వాత చదువు రాలేదు కాబట్టి సినిమాల కోసమే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడేమో అని చాలా మంది పవన్ గురించి అనుకుంటారు. కానీ అసలు కారణం మాత్రం అది కాదని ఆయన సన్నిహితులు చెప్తుంటారు. పవన్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోడానికి కారణం చిరంజీవి. అవును.. పవన్ కళ్యాణ్ కి ముందు నుంచి మార్షల్ ఆర్ట్స్‌పై అస్సలు ఆసక్తి లేదట . కానీ అనుకోని పరిస్థితుల్లో ఆయన చెంతకు వచ్చింది అది. నేర్చుకోవాల్సిన అవసరం కల్పించింది కూడా చిరంజీవే.చెన్నైలో పవన్ చదువుకుంటున్న సమయంలో కొందరు చిరంజీవి సినిమాలు చూసి అతన్ని ఊరికే తిట్టేవాళ్లు..

కాలేజీలో కొందరు పవన్ ముందే తన అన్నయ్య నటనతోపాటు లుక్‌పై కూడా కొన్ని విమర్శలు చేసేవాళ్లు.. అలాంటివి చూసినపుడు విన్నపుడు రక్తం మరిగిపోయేదని.. కానీ సన్నగా రివటలా ఉన్న పవన్ వాళ్లను ఎదిరించలేకపోయాడని చెప్తుంటారు. వాళ్లను కొట్టాలంటే ఇలా ఉంటే సరిపోదు.. కచ్చితంగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి.. అప్పుడే ఈ ఆలోచన పవన్ బుర్రలోకి వచ్చింది.తన అన్నయ్యను కామెంట్ చేస్తున్న వాళ్ల తుక్కు రేగ్గొట్టాలంటే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని ఆయన శిక్షణ తీసుకున్నట్లు పవన్ సన్నిహితులే చెప్తుంటారు. అందులో ఆ తర్వాత ఆయన బ్లాక్ బెల్ట్ కూడా అందుకున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: