"మాస్టర్" సినిమాతో కోలీవుడ్ స్టార్ విజయ్ తన ఖాతాలో మరో సూపర్ హిట్ ను నమోదు చేసుకున్నాడు. లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా తెలుగు ఆడియెన్స్ ను కూడా అలరించింది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి నెగటివ్ రోల్ లో కనిపించాడు. ఇప్పుడు తలపతి విజయ్ నెక్స్ట్ మూవీస్ పై దృష్టి పెట్టాడు. మాస్టర్ మూవీ సక్సెస్ తో మరిన్ని ప్రాజెక్ట్స్ కు ఒకే చెప్పాడు ఈ కోలీవుడ్ స్టార్.  

నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేయబోతున్న ఓ సినిమాలో విజయ్ లీడ్ రోల్ పోషించబోతున్నాడు. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు పూజా హెగ్డేను మేకర్స్ సంప్రదించారని తెలుస్తోంది. 

సినిమా కోసం నెల్సన్ దిలీప్ కుమార్ పూజాను హైదరాబాద్ లో కలిసినట్టు తెలుస్తోంది. డిస్కషన్స్ జరిగినట్టు తెలుస్తోంది. ఐతే, అఫీషియల్ కన్ఫర్మేషన్ ఐతే ఇప్పటివరకూ రాలేదు. ఫిబ్రవరిలో పూజా హెగ్డేకి సంబంధించిన విషయాన్ని మేకర్స్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది. 

ఈ ప్రాజెక్ట్ కు పూజా ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఒక వేళ అన్నీ సవ్యంగా జరిగితే పూజా హెగ్డేకు కోలీవుడ్ లో ఈ సినిమాతో మంచి ప్లాట్ఫార్మ్ లభించే అవకాశం ఉంటుంది. టాలీవుడ్ లో ఎలాగైతే నిలదొక్కుతుందో అదే విధంగా కోలీవుడ్ లో కూడా సుస్థిరస్థానాన్ని ఏర్పరచుకునే అవకాశం ఉంటుంది ఈ పొడుగు కాళ్ళ సుందరికి. 

పూజాకు కోలీవుడ్ కొత్తేమీ కాదు. 2012లో "ముగమూడి" సినిమాలో నటించింది. ఈ సినిమాలో జీవా హీరోగా నటించాడు. ఈ సినిమా తెలుగులో "మాస్క్" పేరుతో విడుదలైంది. మొత్తానికి పూజాకు విజయ్ తో సినిమా కోలీవుడ్ లో కమ్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు. తెలుగులో ఎలాగో ఈ ఇద్దరికీ మార్కెట్ ఉండటం వలన ఈ సినిమా తెలుగులో కూడా విడుదలవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: