కరోనా భయం వెంటాడుతున్న సమయంలో సంక్రాంతి సీజన్ వచ్చింది. అందులోనూ 50% ఆక్యుపెన్సీ రూల్‌ ఉండటంతో... థియేటర్స్‌కి జనాలు వస్తారా? రారా?  పెట్టుబడి వస్తుందా? రాదా? అనే అనుమానం సినిమా వర్గాల్లో ఉండేది. సంక్రాంతి సినిమాలు ఈ భయాన్ని పోగొట్టాయి. 50 పర్సెంట్‌ ఆక్యుపెన్సీతోనే లాభాలు తీసుకొచ్చాయి.

ఆరంభం బాగుంటే.. శుభసూచకగా భావిస్తారు. ఏడాదంతా బాగుంటుందన్న ఆశ.. నమ్మకం వస్తుంది. గత ఏడాది మాదిరి 2021 సంక్రాంతి కూడా అదిరింది. ఈ సినిమా పండుగకు రవితేజ క్రాక్‌తో.. రామ్‌ రెడ్‌తో... బెల్లంకొండ అల్లుడు అదుర్స్‌తో వచ్చారు. డబ్బింగ్ మూవీ మాస్టర్‌ విడుదలైంది. ముందుగా వచ్చిన క్రాక్‌  8 రోజుల్లో 23 కోట్ల షేర్‌ కలెక్ట్‌ చేసింది. లాంగ్‌ రన్‌లో 30 కోట్లు కలెక్ట్ చేస్తుందని అంచనా.

రెడ్‌కు వచ్చిన టాక్‌కు .. కలెక్షన్స్‌కు సంబంధమే లేదు. సినిమా మాదిరి ఇదొక ట్విస్ట్‌ అంటూ... రామ్‌ పేర్కొన్నాడు కూడా. నాలుగు రోజుల్లో 14 కోట్లు కలెక్ట్‌ చేసిందంటున్నాయి చిత్ర వర్గాలు. ఆల్ రెడీ బ్రేక్‌ ఈవెన్‌ అయిందని ప్రకటించారు నిర్మాత.

క్రాక్‌ తర్వాత వచ్చిన మాస్టర్‌ను తెలుగు ప్రేక్షకులు ఆదరించి 11 కోట్లు ఇచ్చారు. పెట్టుబడి రాబట్టేసి లాభాల్లో పయనిస్తోంది. 10 నెలలుగా ఓటీటీలతో బోర్‌ ఫీలైన ప్రేక్షకులు సంక్రాంతి సినిమాలతో రిలీఫ్‌ ఫీలయ్యారు. టాక్‌తో సంబంధం లేకుండా... చూసేశారు.
50 పర్సెంట్‌ ఆక్యుపెన్సీతో ఇంత భారీ మొత్తం ఎలా వచ్చిందన్న డౌట్‌ కూడా వచ్చింది. అయితే.. కొన్ని మల్టీప్లెక్సులు.. సింగిల్‌ థియేటర్స్‌లో 100 పర్సెంట్‌ టిక్కెట్లు ఇచ్చేయడంతో... సినిమా రిలీజై వారం తిరగకుండానే.. లాభాల బాట పట్టాయి.

కరోనా భయం మాస్‌ ఆడియన్స్‌లో ఎక్కడా కనిపించలేదు. కొత్త సినిమాలు చూడడానికి ఫ్యామిలీ ఆడియన్స్‌ కూడా వచ్చినా.. గతంలో మాదిరి రాలేదనే చెప్పాలి. సంక్రాంతి సినిమాలు సమ్మర్‌కు వస్తున్న పెద్ద సినిమాలు వకీల్‌సాబ్‌.. ఆచార్య.. రాధే శ్యామ్‌లో భయాన్నిపోగొట్టాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: