సాధారణంగా సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించే షో  లలో ఎంత ఎంటర్టెన్మెంట్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.  తనదైన వాక్చాతుర్యంతో ఎన్నో ఏళ్ల నుంచి టాలీవుడ్ బుల్లితెర పై టాప్ యాంకర్గా కొనసాగుతూ వస్తుంది సుమ.  అయితే సుమ కీ  ఏజ్  పెరుగుతూ వస్తుంది కానీ ఎక్కడా యాంకరింగ్ లో  గ్రేస్ ఏమాత్రం తగ్గలేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  ఇప్పుడు టాలీవుడ్ బుల్లితెర పై ఉన్న యాంకర్స్ ఎవరికీ సాధ్యం కాని రీతిలో తన స్పాంటినిటీ  పంచులతో బుల్లితెర ప్రేక్షకులందరికీ ఎంటర్టైన్మెంట్ పంచుతూ ఉంటుంది.  ఈ క్రమంలోనే రోజు రోజుకు మరింత మంది అభిమానులను సంపాదించుకుంటు  తీసుకు పోతుంది యాంకర్ సుమ.



 ఈ క్రమంలోనే యాంకర్ సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న క్యాష్ అనే ప్రోగ్రాం ప్రతి వారం బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే ఈ టీవీలో ప్రసారమయ్యే ఈ షో  బుల్లితెర ప్రేక్షకులకు ప్రతివారం కొత్త ఎంటర్ టైన్మెంట్ పంచుతూ ఉంటుంది.  కాగా  ఇక వచ్చే వారం క్యాష్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఇటీవలే విడుదల కాగా ప్రస్తుతం ఈ ప్రోమో  బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. సాధారణంగా క్యాష్ లో ప్రతి ఎపిసోడ్ లో కొత్త గెస్టులు  ఎంట్రీ ఇస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.



 కేవలం సెలబ్రిటీలు మాత్రమే కాదు కొంతమంది స్టూడెంట్స్ కూడా వచ్చి  క్యాష్ షో లో భాగంగా ఎంటర్ టైన్మెంట్ పంచుతూ ఉంటారు. ఇక సాధారణంగా సుమ పలురకాల ఫన్నీ టాస్క్  లతో ఎంటర్ టైన్మెంట్ పంచుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఇటీవల ఒక స్టూడెంట్ ని సెలెక్ట్ చేసుకుని గెస్ట్లుగా వచ్చిన ఢీ  మాస్టర్స్, కంటెస్టెంట్స్ ని ఇంటర్వ్యూ చేస్తున్న సమయంలో... డైలాగ్ చెప్పడం వచ్చా అంటూ సుమ ఒక లేడీ కంటెస్టెంట్ ని  ప్రశ్న అడుగుతుంది.. ట్రై చేస్తాను అంటూ ఆమె చెప్పడంతో ట్రై నీ పక్కన ఉన్న అబ్బాయి చేస్తున్నాడు అంటూ చెబుతుంది. ఈ క్రమంలోనే ఏంటి బాబు ముసిముసినవ్వులు నవ్వుతున్నావు అని సుమ అంటే   పక్కనే ఉన్న స్టూడెంట్ అది ముసిముసినవ్వులు కాదు గుసగుస  నవ్వులు  అంటూ అక్కడే ఉన్న స్టూడెంట్ పంచ్  వేయడంతో సుమ ఒక్కసారిగా షాక్  అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: