ప్రస్తుతం మాస్ మహారాజ్ రవితేజ "క్రాక్" సినిమా బ్లాక్ బాస్టర్ హిట్టుతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. చాలా కాలం తర్వాత రవితేజ నుండి వచ్చిన పర్ఫెక్ట్ మాస్ సినిమా కావడంతో "క్రాక్" సినిమాకు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇప్పటికీ కూడా మంచి వసూళ్లనే రాబడుతుంది. ఈ సినిమాకు పోటీగా వచ్చినా మరో మూడు సినిమాలను దాటుకొని సంక్రాంతి విజేతగా మాస్ మహారాజ్ నిలిచాడు. దాదాపుగా పదేళ్ల తర్వాత రవితేజకు వచ్చిన పర్ఫెక్ట్ బ్లాక్ బస్టర్ "క్రాక్" సినిమానే అని చెప్పవచ్చు.  

క్రాక్ సినిమాతో సాలిడ్ కం బ్యాక్ హిట్ అందుకున్న రవితేజ ఇదే జోష్ కొనసాగించాలని మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ను లైన్ లో పెట్టేసారు. ఈసారి  “ఖిలాడి” గా వినోదాన్ని పంచేందుకు సిద్ధమయ్యాడు. రమేష్ వర్మ  దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ పై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్న రవితేజ షూటింగ్ ను తొందరగా పూర్తిచేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా కూడా పక్క మాస్ ఎంటర్ టైనర్ అని తెలుస్తుంది. ఈ కొత్త సంవత్సరం సంక్రాంతి కానుకగా “క్రాక్”తో మంచి గిఫ్ట్ ఇచ్చిన రవితేజ మరి ఇదే జనవరిలో వస్తున్న తన పుట్టినరోజు గిఫ్ట్ కూడా ఇవ్వనున్నట్టుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి.

జనవరి 26 తన పుట్టినరోజు సందర్భంగా తన “ఖిలాడి” నుంచి టీజర్ రాబోతుందని ఫిలింనగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మేకర్స్ గ్లింప్స్ తరహా వీడియోను విడుదల చేస్తారన్నట్టుగా టాక్. మరి ఇప్పటికే షూటింగ్ చాలా వరకు కంప్లీట్ కావడంతో తో రవితేజ అ పుట్టినరోజు సందర్భంగా టీజర్ రావడం పక్క అని తెలుస్తుంది. మరి ఆ గిఫ్ట్ వస్తుందా లేదా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: