గడచిన కొన్నాళ్లుగా మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న సినిమాలు వరుసగా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన రేంజ్ సక్సెస్ ని అయితే అందుకోలేకపోయాయి. దానితో ఆయన కెరీర్ పరంగా కొంత ఆలోచనలో పడ్డారు. ఫైనల్ గా తదుపరి సినిమా అవకాశాన్ని గోపీచంద్ మలినేనికి అందించిన రవితేజ, అతడితో చేసిన లేటెస్ట్ సినిమానే క్రాక్. ఇటీవల సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా భారీ సక్సెస్ అందుకుని బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఎట్టకేలకు రవితేజ కి సూపర్ బ్రేక్ ని అందించింది.

రవితేజ, పోతురాజు వీరశంకర్ అనే మాస్ పోలీస్ అధికారి పాత్ర పోషించిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా యువ సంగీత తరంగం థమన్మూవీ కి మ్యూజిక్ ని అందించాడు. సముద్రఖని, రవిశంకర్, వరలక్ష్మి శరత్ కుమార్ నెగటివ్ పాత్రలు పోషించిన ఈ సినిమాలో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేమ్ సుధాకర్ కీలక పాత్ర చేసాడు. ఇక తొలి రోజు తొలి ఆట నుండి ఈ క్రాక్ సినిమాకు యునానిమస్ టాక్ రావడంతో యూనిట్ ఎంతో ఆనందంలో మునిగిపోయింది. మరోవైపు చాలా రోజుల తరువాత తమ హీరోకి సూపర్ సక్సెస్ దక్కడంతో మాస్ రాజా ఫ్యాన్స్ కూడా అమితానందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక క్రాక్ తో పాటు మరికొన్ని సినిమాలు ఇటీవల థియేటర్స్ లో రిలీజ్ అయినప్పటికీ, ఈ సినిమా రేంజ్ లో ఏది కూడా భారీ సక్సెస్ ని అందుకోలేకపోయిందని, దానితో ఇప్పటికే క్రాక్ కి థియేటర్స్ ని మరింతగా పెంచారని అంటున్నారు విశ్లేషకులు.

ఇక ప్రస్తుతం 50 శాతం ఆక్యుపెన్సీ ఉన్నప్పటికీ దాదాపుగా చాలా ఏరియాల్లో అద్భుతంగా కొనసాగుతున్న ఈ సినిమా ఒకవేళ పూర్తి సీటింగ్ అనుమతి ఉన్నట్లయితే మరింత భారీ స్థాయి కలెక్షన్ రాబట్టి ఉండేదని, ఇక దీని ఊపు చూస్తుంటే మరొక రెండు వారాల వరకు కూడా కలెక్షన్ బాగానే వచ్చేలా ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఎవడైనా గట్టిగా కొడతాడు, బలంగా కొడతాడు, కానీ మాస్ రాజా మాత్రం ఈ క్రాక్ మూవీ తో కలెక్షన్స్ ని టాపు లేపి కొడుతున్నాడని పలువురు ఆడియన్స్ సరదాగా తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: