ప్రస్తుతం టాలీవుడ్ సినిమా పరిశ్రమలో అగ్ర సంగీత దర్శకుడిగా వరుసగా మంచి సక్సెస్ లతో పాటు పలు అవకాశాలు కూడా అందుకుంటూ కొనసాగుతున్న యువ సంగీత తరంగం థమన్. రవితేజ నటించిన కిక్ సినిమాతో తొలిసారిగా కెరీర్ పరంగా పెద్ద బ్రేక్ అందుకున్న థమన్, ఇటీవల ఆయన నటించిన క్రాక్ సినిమాకి వండర్ఫుల్ సాంగ్స్ తో పాటు అదిరిపోయే రేంజ్ లో నేపధ్య సంగీతం అందించి ఆడియన్స్ నుండి శభాష్ అనిపించుకుంటున్నాడు.

ఇక గత ఏడాది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే ల కలయికలో త్రివిక్రమ్ తెరకెక్కించిన అలవైకుంఠపురములో సినిమాతో అత్యద్భుత విజయాన్ని అందుకోవడంతో పాటు అందులోని సాంగ్స్ తో ఏకంగా జాతీయ స్థాయిలో పేరు దక్కించుకున్న థమన్ చేతిలో ప్రస్తుతం చాలానే బడా సినిమాలు ఉన్నాయి. సూపర్ స్టార్ మహేష్ సర్కారు వారి పాట, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్, అలానే అయ్యప్పనుం కోషియం తెలుగు రీమేక్, ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీ, బాలయ్య బోయపాటి మూవీ, వరుణ్ తేజ్ గని, నాని టక్ జగదీశ్, మెగాస్టార్ చిరంజీవి లూసిఫర్ తెలుగు రీమేక్ సినిమాలతో థమన్ ఎంతో బిజీగా ఉన్నాడు. అయితే ఇక్కడే థమన్ కి కొంత ఒత్తిడి కూడా ఎదురయ్యే ఛాన్స్ ఉందని అంటున్నాయి కొన్ని ఇండస్ట్రీ వర్గాలు. ఈ విధంగా వరుసగా పెద్ద ఆఫర్లు అందిపుచ్చుకుంటున్న థమన్, వాటితో మంచి సక్సెస్ లు అందుకుని అద్భుతమైన సంగీతం అందిస్తే అతడికి భవిష్యత్తులో మరింత గొప్ప పేరు లభిస్తుందని, అయితే వీటిలో ఏ ఒక్క సినిమాకైనా ఆశించిన రేంజ్ మ్యూజిక్ ఇవ్వలేకపోతే మాత్రం ఆయా హీరోల అభిమానుల నుండి థమన్ నెగటివిటీ ఎదుర్కునే అవకాశం కూడా ఉందని అంటున్నారు.

ఇటీవల అలవైకుంఠపురములో సాంగ్స్ సక్సెస్ తో పలువురు హీరోల ఫ్యాన్స్ యొక్క అటెన్షన్ పూర్తిగా థమన్ వైపుకు మళ్లిందని, తమ హీరోలతో అతడు చేస్తున్న సినిమాల సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటివి అదరగొడతాడని వారు భావిస్తున్నారని, ఈ విధంగా థమన్ కి ఇది ఒకింత పెద్ద ఛాలెంజ్ అని, అతడు ఏ మాత్రం ఒక్క సినిమా విషయమైన కొంత అలసత్వం వహించినా ఆ సినిమా అభిమానుల నుండి మాత్రం దారుణంగా ట్రోల్స్ ఎదుర్కోక తప్పదని చెప్తున్నారు. అయితే థమన్ మాత్రం తప్పకుండా అన్ని సినిమాలకు పూర్తి న్యాయం చేస్తారు అని అంటున్నారు ఆయన అభిమానులు......!!

మరింత సమాచారం తెలుసుకోండి: