కరోనా కారణంగా దాదాపు ఏడెనిమిది నెలలు సినిమా షూటింగ్‌లకు బ్రేక్ పడింది. దీంతో సినిమా వాళ్లంతా ఇళ్లకే పరిమితమైపోయారు. ఇక కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే మళ్లీ షూటింగ్‌లకు అనుమతులను ఇచ్చిందో మళ్లీ హుషారుగా వీళ్లంతా షూటింగ్‌లు మొదలుపెట్టారు. సినిమా చిత్రీకరణ మొదలైన తరువాత చాలా మంది నటీనటులు కరోనా బారిన కూడా పడ్డారు. వీరిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా ఒకరు. కరోనా బారిన పడిన ఆయన ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నారు. అంతేకాకుండా ఆయన ఒకే సారి రెండు షూటింగుల్లో పాల్గొంటూ నిమిషం కూడా గ్యాప్ లేకుండా ఉంటున్నారట. మెగాస్టార్ చిరంజీవి, సందేశాత్మక సినిమాలు తీసే డైనమిక్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఆచార్య సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

ఈ చిత్రంలో రామ్ చరణ్ కూడా ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. రామ్ చరణ్ ఈ చిత్రంలో సిద్ద అనే క్యారెక్టర్ చేస్తున్నాంటూ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ఇటీవల ఓ ఫొటోను విడుదల చేసింది. ఈ ఫొటో బట్టి రామ్ చరణ్ క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. రామ్ చరణ్ ఆచార్య షూటింగ్‌లో పాల్గొన్నారంటూ చిత్ర యూనిట్ పోస్ట్ పెట్టింది. ఇదిలా ఉంటే.. మరోపక్క దర్శకధీరుడు, జక్కన్న రాజమౌళి కూడా మంగళవారం ఓ పోస్ట్ పెట్టారు. ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ షూటింగ్ మొదలైందని, రామరాజు, భీం ఏదైతే సాధించాలని అనుకున్నారో దాన్ని నెరవేర్చేందుకు ఇద్దరూ ఒకటయ్యారంటూ రాజమౌళి తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఈ పోస్ట్ చూసిన తరువాత రామ్ చరణ్ అభిమానులకు ఒకటే డౌట్ వస్తోంది.

రామ్ చరణ్ ఒకేసారి రెండు షూటింగ్‌లలో ఎలా పాల్గొంటున్నారని వారంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ రెండు షూటింగుల్లో ఒకటి పగలు పూట జరుగుతుండగా.. మరొకటి రాత్రి సమయాల్లో జరుగుతోందట. రామ్ చరణ్ ఉదయం ఒక షూటింగ్‌లో రాత్రి మరో షూటింగ్‌లో పాల్గొంటున్నారని మెగా కాంపౌండ్ నుంచి సమాచారం అందుతోంది. ఆచార్యలో రామ్ చరణ్ రోల్ చిన్నదే కావడంతో వారం నుంచి పది రోజుల్లోనే ఈ చిత్రంలో తన పార్ట్ పూర్తి కానున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత తన పూర్తి సమయాన్ని ఆర్ఆర్ఆర్ చిత్రానికే రామ్ చరణ్ కేటాయించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: