సంక్రాంతి కానుకగా విడుదలైన క్రాక్ సినిమా సూపర్ హిట్ అవడంతో రవితేజ కెరీర్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చేసింది. క్రాక్ సినిమా కథను దర్శకుడు ముందుగా విక్టరీ వెంకటేష్‌కు వినిపించగా.. ఆయన ఈ చిత్రం చేసేందుకు నో చెప్పారట. దీంతో ఈ కథ రవితేజ వద్దకు వెళ్లింది. రవితేజకు ఈ కథ నచ్చడంతో ఆయనకు అవకాశం ఇచ్చాడు. వీరిద్దరి కాంబోలో అప్పటికే రెండు సినిమాలు రావడంతో మరో సినిమా చేస్తే ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని అంతా అనుకున్నారు. అనుకున్న విధంగానే క్రాక్ మంచి ఊపునిచ్చింది. క్రాక్ విజయంతో గోపీచంద్ మలినేని మరియు రవితేజలు మళ్లీ ఫామ్ లోకి వచ్చేశారు. ప్రస్తుతం ఇద్దరూ మంచి మంచి సినిమాలను లైన్‌లో పెట్టేస్తున్నారు. మాస్ మహారాజ్ రవితేజ తదుపరి సినిమాల విషయంలో కూడా జోరు పెంచేసినట్టు తెలుస్తోంది.

పోలీస్ బ్యాక్ డ్రాప్ సినిమాగా విడుదలైన క్రాక్ హిట్ టాక్‌ను అందుకుని కలెక్షన్స్ పరంగా దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. క్రాక్ తర్వాత రవితేజ డైరెక్టర్ రమేష్ వర్మతో మరో సినిమాకు కమిట్ అయిన విషయం అందరికి తెలిసిందే. ఇది వరకు వీరి కాంబినేషన్ లో వీర అనే సినిమా విడుదల కాగా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా మిగిలింది. రమేష్ వర్మ తన కెరీర్ లో సాధించిన ఏకైక సూపర్ హిట్ సినిమా రాక్షసుడు మాత్రమే. ఆ సినిమా తమిళ హిట్ చిత్రం రాక్షసన్ కు రీమేక్. ఆ హిట్ తరువాత ఆయన ఇప్పుడు మరోమారు రవితేజతో సినిమా తీస్తున్నారు.

ఖిలాడి అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాలో రవితేజ డ్యూయెల్ రోల్ పోషిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో ఒకటి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ అయితే మరొకటి బిజినెస్ మ్యాన్ పాత్ర అని సమాచారం వినిపిస్తోంది. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ కూడా పూర్తి కావడంతో.. జనవరి 26న మాస్ మహరాజ్ రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఖిలాడి చిత్రానికి సంబంధించి ఏదో ఒక అప్ డేట్ రావొచ్చని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. మేకర్స్ మైండ్ లో ఏముందో తెలియదు గాని రవితేజ నుండి పక్కా సర్ప్రైజ్ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలలో చర్చ సాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: