పాత తెలుగు సినిమాల్లో అత్త పాత్రలకు పెట్టింది పేరైన సూర్యకాంతం కు ధీటైన నటి ఇప్పటివరకు ఎవరు రాలేదని చెప్పాలి. కొంతమంది ప్రయత్నించినా ఆమె రేంజ్ లో మాత్రం ప్రేక్షకులను అలరించలేకపోయారు.. ఆమె సినిమా లో ఉంటే చాలు అప్పట్లో సినిమా సూపర్ హిట్ అయ్యేది.. హీరోయిన్కన్నా ఆమె ఫుల్ బిజీ గా ఉండేది. ఈమె నుంచే టాలీవుడ్ లో లేడీ విలన్ పాత్రలు పుట్టాయని ఇండస్ట్రీ పెద్దలు చెప్తుంటారు. తనదైన టైం లో  హీరోలకు సమానంగా ఆమె రెమ్యునరేషన్ వసూలు చేసేదట.. ఈ నేపథ్యంలో ఇప్పటితరం సూర్యకాంతంగా ఎదుగుతుంది తమిళ నటి, స్టార్ హీరో శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి శరత్ కుమార్..

ఇటీవలే ఆమె నటించిన క్రాక్ సినిమా ఎంత విజయవంతం అయ్యిందో తెలిసిందే. ఆ సినిమా హిట్ క్రెడిట్ లో ఈమెకు కొంత భాగం ఉంది.. ఆమె నటన తో లేడీ విలనిజం లో ప్రత్యేకత చూపించింది. ఈ సినిమా హిట్ తో రవితేజ, దర్శకుడు గోపీచంద్ లకు ఎలాంటి పేరైతే వచ్చిందో అంతకంటే ఎక్కువే జయమ్మ కు వచ్చింది. అంతగా నెగెటివ్ షేడ్స్ కలిగిన ఆ పాత్రలో ఆమె చెలరేగిపోయారు. ఆల్రెడీ ఆమె తమిళనాట లేడీ విలన్ తరహా పాత్రలలో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు.

'తెనాలి రామకృష్ణ బిఏబీఎల్' సినిమాలోనూ ఆమె పవర్ఫుల్ విలన్ పాత్రనే పోషించారు. విలనిజంలో తనదైన స్టైల్ తో ఆమె ఆకట్టుకున్నారు. ఆ తరువాత 'క్రాక్' సినిమాతో మరిన్ని మార్కులు దక్కించుకున్నారు. అయితే లేడీ విలన్ పాత్రలు తెలుగులో ఎక్కువగా ఉండవు కాబట్టి వరలక్ష్మిని ఇష్టపడే అభిమానులు ఆమెను మిస్ అవుతాం అని అనుకోవచ్చు.. అయితే లేడీ విలన్ లు ఉండరు కానీ అత్త పాత్ర లు మాత్రం బోలెడు వస్తుంటాయి..తెలుగులో పవర్ఫుల్ అత్త పాత్రలకు ఎప్పుడూ కొదవ ఉండదు. ఒకప్పుడు తెలుగు తెరపై గడసరి అత్త పాత్రలకు వాణిశ్రీ పేరు ప్రముఖంగా వినిపించింది. ఆ తరువాత ఐ డోంట్ కేర్ పాలసీతో సాగే ఈ తరహా పాత్రలో 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమాలో రమ్యకృష్ణ దుమ్మురేపేసింది. ఇకపై ఈ తరహా పాత్రలలో వరలక్ష్మీ శరత్ కుమార్ కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే టాక్ ఫిల్మ్ నగర్లో జోరుగా వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: