టాలీవుడ్ లో టాలెంట్ కి కొదవ లేదు. ఎందరో టెక్నీషియన్స్ తమదైన ప్రతిభను చూపించి టాలీవుడ్ ఖ్యాతిని పెంచారు. వారి సినిమాలు తెలుగు వారి మదిలో ఎప్పటికీ నిలిచిపోయేలా చేశారు. అటువంటి వారిలో టాప్ డైరెక్టర్  ఈవీవీ సత్యనారాయణ ఒకరు.

ఆయన కామెడీతో చెడుగుడే ఆడుకున్నారు. తన చిత్రాలలో కమెడీకి పెద్ద పీట వేస్తూ వరసపెట్టి సక్సెస్ లు చూశారు. ఈవీవీ మార్క్ సినిమాలుగా కూడా అవి పేరు తెచ్చుకున్నాయి. హాస్య బ్రహ్మ జంధ్యాల శిష్యుడిగా దర్శకత్వ శాఖలో మెలకువలు నేర్చుకున్న ఈవీవీ 90 దశకంలో ఒక రేంజి లో వెలిగిపోయారు. ఆయనదే ఆ దశాబ్దం అన్నట్లుగా సూపర్ డూపర్ హిట్లు కొట్టారు.

ఈవీవీ ఫస్ట్ మూవీ చెవిలో పువ్వు అంటూ రాజేంద్రప్రసాద్ సీత హీరోహీరోయిన్లుగా తీశారు. అది ఫ్లాప్ అయింది. ఆ తరువాత అవకాశాలు రాలేదు. కొన్నాళ్ళకు డీ రామానాయుడు పిలిచి అవకాశం ఇచ్చారు. అలా వచ్చిందే ప్రేమ ఖైదీ. ఇది సూపర్ డూపర్ హిట్. దాంతో వెనక్కి చూసుకోలేదు ఈవీవీ. బ్లాక్ బస్టర్ హిట్లే ఇచ్చారు.
ఇక ఆయన మెగాస్టార్ చిరంజీవితో అల్లుడా మజాకా అంటూ తీసిన సినిమా 1995లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. రాజేంద్ర ప్రసాద్ ఈవీవీ కాంబో కి  అప్పట్లో ఎంతో పేరు ఉండేది. ఈ ఇద్దరూ కలసి ఆ ఒక్కటీ అడక్కు అంటూ చేసిన ఏవీఎం వారి మూవీ 1992లోనే కలెక్షన్ల సునామీ కురిపించింది. ఇక సీనియర్ హీరో నరేష్ తో  తీసిన జంబలడికి పంబ మూవీ కూడా సూపర్ హిట్.

సూపర్ స్టార్ క్రిష్ణ 300 సినిమా తెలుగు వీర లేవరాకు ఈవీవీ డైరెక్టర్. ఆ విధంగా టాప్ డైరెక్టర్ గా సత్తా చాటారు. నాగార్జునతో ఈవీవీ తీసిన మూవీ హ‌లో బ్రదర్ బ్లాక్ బస్టర్ హిట్. ఇప్పటికీ టీవీలో ఆ మూవీ వస్తే మంచి రేటింగ్స్ వస్తాయి. వెంకటేష్ తో తీసిన ఇల్లాలు ప్రియురాలు మూవీ మరో సూపర్ హిట్.

బాలయ్యతో ఈవీవీ గొప్పింటి అల్లుడు మూవీ తీశారు. బాలయ్య సొంత బ్యానర్ లోనే ఈ మూవీని నిర్మించారు. ఇది హిట్ అయింది. దీనికంటే ముందు బాలయ్యతో ఈవీవీ కాంబోలో మాతో పెట్టుకోకు అన్న మూవీ రావాల్సి ఉంది. ఈ సినిమా కు మొదట ఈవీవీనే అనుకున్నా కారణాలు తెలియవు కానీ ఆయన ప్లేస్ లోకి కోదండరామిరెడ్డి వచ్చి చేరారు. మొత్తానికి బాలయ్యతో అలా చాన్స్ మిస్ అయినా బాలయ్య సొంత బ్యానర్ లోనే చేయడం ద్వారా  లోటు తీర్చుకున్నారు ఈవీవీ. ఈవీవీ తన కుమారులు ఇద్దరినీ వెండి తెరకు పరిచయం చేశారు. పెద్ద కుమారుడు ఆర్యన్ రాజేష్ కొన్ని సినిమాల్లో హీరో చేస్తే నరేష్ కామెడీ హీరోగా రాణిస్తున్నాడు. ఈవీవీ 2011 జనవరి 21న మరణించారు. అయన చనిపోయి నేటికి పదేళ్ళు. కానీ ఆయన సినిమాలకు ఎపుడూ వేయ్యేళ్ళే.


మరింత సమాచారం తెలుసుకోండి: