టాలీవుడ్ ఇండస్ట్రీలో డబ్బింగ్ సినిమాలకు ఉండే వాల్యూ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. రోజురోజుకు పరభాషా సినిమాల మార్కెట్ వాల్యూ ఎంతగానో పెరుగుతోంది. ఇక పాన్ ఇండియా అంటే చాలు బాక్సాఫీస్ వద్ద లోకల్ సినిమాల కంటే హై రేంజ్ లో వసూళ్లను అందుకుంటున్నాయి.ఇక నెక్స్ట్ అందరిచూపు kgf 2 పైనే ఉంది. ఆ సినిమాను తెలుగులో ఎవరు రిలీజ్ చేస్తారో గాని ఊహలకు అందని ధరకు రిలీజ్ రైట్స్ ను దక్కించుకోవాల్సిందే..

యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ మూవీ తెలుగులో నిర్మాత సాయి కొర్రపాటి డబ్బింగ్ రైట్స్ ను రూ.5 కోట్లకు కొనుగోలు చేసి దాదాపుగా రూ.15 కోట్ల లాభాలను దక్కించుకున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల టాక్.కేజీఎఫ్ 1 తో పోల్చి చూస్తే కేజీఎఫ్ 2 భారీ బడ్జెట్ తో తెరకెక్కడం వాస్తవమే.అయితే తెలుగు రైట్స్ కు 75 కోట్లు మాత్రం చాలా పెద్ద మొత్తం అని చెప్పవచ్చు.కరోనా, లాక్ డౌన్ వల్ల పరిస్థితులు కూడా పూర్తిగా మారిపోయాయి.ఇలాంటి సమయంలో పెద్ద సినిమాల థియేట్రికల్ రైట్స్ కూడా తక్కువ మొత్తానికే అమ్ముడవుతున్నాయి.మరి కేజీఎఫ్ నిర్మాతలు 75 కోట్లు ఆశిస్తుండగా ఈ సినిమా హక్కులు ఎంత మొత్తానికి అమ్ముడవుతాయని  అందరు ఎదురు చూస్తున్నారు

కేజీఎఫ్ చాప్టర్ మరింత సక్సెస్ సాధించగలదన్న నమ్మకంతో చిత్ర యూనిట్ ఉంది. దాంతో ఈ చిత్రం తెలుగు వెర్షన్వెర్షన్ రైట్స్ కు ఓ రేంజిలో క్రేజ్ ఏర్పడింది. ఇప్పటికే విడుదల జీజర్ దుమ్మురేపింది.కేజీఎఫ్ 2 పై తెలుగు ప్రేక్షకుల్లో కూడా అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. కాని ఒక డబ్బింగ్ సినిమా ఈ రేంజ్ లో వసూళ్లు సాధించడం అనుమానమే అంటున్నారు. అయితే రజినీకాంత్ వంటి స్టార్ హీరోల సినిమాలకు అది సాధ్యం అయ్యింది. కాని ఈ సినిమా పరిస్థితి ఏంటీ అనేది మాత్రం విడుదల తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.దానికి తోడు మనకు సీక్వెల్స్ హిట్టైన ధాకలాలు తక్కువ. ఎంతో హైప్ తో వచ్చిన సీక్వెల్స్ ఆ స్దాయిలో నిలబడలేదని కొందరు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఎవరేమన్నా కేజీఎఫ్ 2 కు ఉన్న క్రేజ్ మాత్రం తక్కువ అంచనా వేయలేమనేది నిజం.

మరింత సమాచారం తెలుసుకోండి: