ఎనర్జిటిక్ హీరో రామ్ మన తెలుగు తెరకి పరిచయం అయ్యి ఈ సంక్రాతికి సరిగ్గా 15 సంవత్సరాలు అవుతుంది. దేవదాస్ సినిమాతో మన ముందుకు వచ్చాడు. ఆ సినిమా రామ్ కి మంచి హిట్ ఇచ్చింది. తర్వాత చాలా సినిమాలే చేసుకుంటే వచ్చాడు. కానీ చేసిన సినిమాల్లో చాలా వరకు ఫట్  అయ్యాయనే చెప్పాలి. కేవలం కొన్ని సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి అని చెప్పాలి. వరసగా రెండు సినిమాలు ప్లాప్ అయితే తరువాత సినిమా హిట్ అవుతూ వస్తుంది. అయితే కధ మళ్ళీ మొదటికే వచ్చింది అని చెప్పాలి. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి ఊపు మీద ఉన్న రామ్ ఇప్పుడు లేటెస్ట్ గా రిలీజ్ అయిన రెడ్ సినిమా మళ్ళీ ప్లాప్ లిస్ట్ లో చేరిపోయింది. అలా రామ్ కెరీర్ ఒడిదుడుకులతో ముందుకి సాగుతుంది. అసలు రామ్ కి ఎక్కడ తేడా కొడుతుంది అన్నా విషయం ఒకసారి పరిశీలిస్తే... రామ్ ఎంచుకునే సినిమాల విషయంలో ఒక్కోసారి తప్పు దోవ పడుతున్నాడు అనే చెప్పాలి. ఆయన ఎంచుకునే సినిమా కధ విషయంలో కొన్ని లాజిక్స్ మిస్ అవ్వుతున్నాడని పరిశీలకులు అంటున్నారు.

ఒక సినిమా హిట్ అవ్వాలంటే పాటలు, ఫైట్స్, హీరో, హీరోయిన్స్ మాత్రమే ఉంటే చాలదు. కధ, కధనం కూడా బాగుండాలి. అప్పుడే ఆ సినిమా అన్నీ విధాలా మంచి గుర్తింపును సాధిస్తుంది. రెడ్ సినిమా షూటింగ్ అప్పుడు ఆ సినిమా ప్రమోషన్ ని ఒక రేంజ్ లో పబ్లిసిటీ చేసారు. అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసారు. ఎందుకంటే ఇస్మార్ట్ శంకర్ హిట్ అవ్వడంతో ఈ సినిమా కూడా హిట్ అవుతుందని అభిప్రాయపడ్డారు. కానీ రెడ్ సినిమా ప్లాప్ అయింది. ప్రేక్షకులను అంతగా అలరించలేకపోయింది.

రెడ్ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు. ఈ దర్శకుడితో రామ్ అంతకుముందే రెండు సినిమాలు చేసాడు. ఆ  రెండు సినిమాలు ఒక మోస్తరుగా ఆడాయి. అయితే ఈసారి అలాంటి సినిమాలు కాకుండా ఈసారి ఒక కొత్త ప్రయోగం చేసాడు. అయితే ఆ ప్రయోగం విఫలం  అయింది. ప్రయోగాలు చేసేటప్పుడు ఒకసారి కధ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుని ఉండవలిసింది. ఎన్నో  ఆశలతో ఎదురుచూసిన అభిమానులను నిరాశ పరిచాడు రామ్. ఈసారి అయిన ఎంచుకునే కధల విషయంలో లాజిక్ మిస్ అవ్వకుండా  జాగ్రత్తలు వహిస్తే బాగుంటుంది అని విశ్లేషకులు అంటున్నారు.. !!

మరింత సమాచారం తెలుసుకోండి: