ప్రొఫెషనల్ బాక్సర్ గా గుర్తింపు పొందిన ప్రదీప్ ఖారారే, తను బాక్సర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా "వరల్డ్ బాక్సింగ్ కౌన్సిలింగ్ ఏషియన్" టైటిల్ను కూడా సాధించి, తన సత్తా ఏంటో చూపించాడు. ఇక మన దేశంలో ఎవరైనా బాక్సింగ్ నేర్చుకోవాలనే  పట్టుదలతో ఉంటే మాత్రం, తప్పకుండా ప్రదీప్ ఖారారే నే  రోల్ మోడల్ గా నిలుస్తారు అన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రదీప్ ని చూస్తూ  బాక్సర్  అవ్వాలనుకునేవారు, వారి గోల్స్ ని సెట్ చేసుకోవచ్చు. మన ఇండియాలో ప్రదీప్ ఖారారే అంత మంచి పేరును సంపాదించుకున్నాడు.అయితే ప్రదీప్ ఇటీవల నటి మానసి నాయక్ ను  వివాహమాడి, ఆ ఫోటోలు, వీడియోలను  సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

ఇక మానసి నాయక్ విషయానికొస్తే ఈమె మరాఠీ నటి. ఎన్నో టీవీ సీరియల్స్లో నటిస్తూ,తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. అంతేకాకుండా బాగ్తోయి  రిక్షావాలా అనే డాన్స్ ప్రోగ్రాం తో బాగా పాపులర్ అయ్యింది.  మానసి కేవలం టీవీ సీరియల్స్ లోనే కాకుండా ఎన్నో సినిమాలలో కూడా నటించి, తనదైన గుర్తింపును సంపాదించుకుంది. జబర్దస్త్,టార్గెట్,కుటుంబ్  లాంటి ఎన్నో మరాఠీ సినిమాలలో నటించి ప్రేక్షకులలో చెరగని ముద్ర వేసుకుంది.

ఇక వీరిరువురి వివాహబంధం విషయానికొస్తే, మొదట్లో ప్రదీప్,నటి మానసితో ప్రేమలో పడ్డట్టు,అప్పట్లో కొన్ని పుకార్లు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. అయితే అవి పుకార్లు కావని తాము  త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు మానసి, ప్రదీప్ లు ఇటీవల సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. వారు ప్రకటించినదే తడవుగా 2021 జనవరి 19న వీరిరువురు వివాహబంధంతో ఒక్కటయ్యారు. పూణే లో అత్యంత సన్నిహితుల మధ్య మహారాస్ట్రీయుల సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి జరిగింది.అందుకు సంబంధించిన ఫోటోలను కొత్తజంట సోషల్ మీడియాలో షేర్ చేయగా అది నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

గులాబీ రంగు లెహంగాలో వధువు మానసి చూడముచ్చటగా ఉండగా, వరుడు ప్రదీప్ బంగారు వర్ణపు షేర్వానీ ధరించి హుందాగా కనిపించాడు. వీరిరువురి పెళ్లి అనంతరం కొత్తజంట వరుడి స్వస్థలం హర్యానాకు తిరిగి వచ్చింది. కుటుంబ సభ్యులతో కలిసి వివాహానంతరం వేడుకల్లో పాల్గొంటున్నట్లు ఈ జంట సోషల్ మీడియా వేదికగా ట్వీట్  చేశారు.  నటి మానసి పెళ్లి అనంతరం మాట్లాడుతూ.. "ఎట్టకేలకు మిసెస్ ఖారారే అయినందుకు సంతోషంగా ఉందని,ఈ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను అంటూ హర్షం వ్యక్తం చేశారు. అంతేకాకుండా నా సోల్మేట్ తో పాటు అతడి కుటుంబం కూడా నన్ను ఎంతో ఆప్యాయంగా అక్కున చేర్చుకున్నారు. ఇంకా చెప్పాలంటే  ప్రదీప్ నాకంటే ఎనిమిదేళ్ళ వయసులో చిన్న వాడు".అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: