సాధారణంగా బుల్లితెరపై ఎంతోమంది మెజీషియన్స్  తమదైన శైలిలో మ్యాజిక్ చేసి ఎంతో మందిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కొన్నిరకాల క్యాప్  నుంచి పావురాలు తీయడం.. చేతిలో కర్చీఫ్  నుంచి పావురాలు తీయడం లాంటివి చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటారు అనే విషయం తెలిసిందే. ఇలాంటి తరహా మ్యాజిక్  అందరూ చూసే ఉంటారు.  ప్రస్తుతం మనం మాట్లాడుకోబోయే మ్యాజిక్ గురుంచి  మాత్రం మీరు కనీవినీ ఎరుగి ఉండరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 ఎందుకంటే టోపీ నుంచి పావురం తీయడం.. కర్చీఫ్  నుంచి ఇంకేదో తీయడం కాదు ఏకంగా ఒక మనిషిని తన చుట్టూ ఎలాంటి సపోర్ట్ లేకుండా 360 డిగ్రీస్ తిప్పుకున్నాడు ఇక్కడొక మేజీషియన్. ఇది వినడానికి కాస్త అనుమానంగా ఉంది కదా.. ఇందులో ఏదో ట్రిక్ ఉండే ఉంటుంది అని అనిపిస్తుంది కదా.  యాంకర్ సుమ కూడా ఇలాగే అనుకొని తనని కూడా గాలిలోకి లేపాలిఅంటూ చెప్పింది.  ఇంకేముంది యాంకర్ సుమ కోరిన విధంగానే మెజీషియన్ సుమారు రెండు స్టిక్స్  చేతిలో పట్టించి ఒక స్టూల్  ఎక్కించాడు.



 ఇక ఆ తర్వాత సుమ కాళ్ళ కింద నుంచి స్టూల్  తీసేసాడు. అంతేకాదు సపోర్ట్ గా ఉన్న రెండు స్టిక్స్ కూడా తీసేసాడు. దీంతో సుమ కూడా ఏకంగా  గాలి లో ఉండి పోయింది. అది కూడా ఎలాంటి సపోర్ట్  లేకుండా. యాంకర్ సుమ ను గాలిలోకి లేపుతూ మెజీషియన్ మ్యాజిక్ చేయడంతో అక్కడ ఉన్నవారు అందరూ కూడా ఒక్కసారిగా అవాక్కయ్యారు. అంతే కాదు అక్కడ గాలిలో వేలాడుతున్న సుమ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఇంతకీ ఇదంతా ఎక్కడ జరిగింది అని అనుకుంటున్నారా.. ప్రస్తుతం మా టీవీ లో సుమ, రవి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ లో భాగంగా జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: