లాక్ డౌన్ కారణంగా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ యొక్క హావా విపరీతంగా పెరిగిపోయింది. పెద్ద హీరోలు సైతం ఓటీటీ లో విడుదలయ్యే వెబ్ సిరీస్ లలో నటించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ఓటీటీలో విడుదలయ్యే కొన్ని వెబ్ సిరీస్ లపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత నెలకొంటుంది ఇటీవల సైఫ్ అలీ ఖాన్ నటించిన వెబ్ సిరీస్ "తాండవ్" ఎంత వివాదాస్పదం అయిందో అందరికీ తెలిసిందే. హిందూ మతాన్ని కించపరిచేలా ఉందంటూ పలువురు బిజెపి రాజకీయ నేతలు, హిందూ మత పెద్దలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ వెబ్ సిరీస్ డైరెక్టర్ పై అలాగే కొంతమంది నటులపై కేసు కూడా నమోదైన సంగతి తెలిసిందే.

తాజాగా మరొక వెబ్ సిరీస్ పై వివాదం రాజుకుంది. ఓటీటీ లో విజయవంతం అయినా "మిర్జాపూర్" వెబ్ సిరీస్ పై మిర్జాపూర్ వాసి ఒకరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో దాఖలు చేసిన పిటిషన్ ను పురస్కరించుకుని షో మేకర్స్ కు, అమెజాన్ ప్రైమ్ వీడియోస్ కి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

ఈ సిరీస్ లో కూడా మతపరమైన, సామాజిక, ప్రాంతీయ సెంటిమెంట్లను గాయపరిచే సన్నివేశాలు, అక్రమ సంబంధాలను ప్రోత్సహించే సీన్లు ఉన్నాయని అరవింద్ చతుర్వేది అనే వ్యక్తి తన పిటిషన్ లో ఆరోపించాగా ఈయన దాఖలు చేసిన ఫిర్యాదును పురస్కరించుకుని తాము ఈ సిరీస్ మేకర్స్ రితేష్ సిద్వానీ, ఫరా అఖ్తర్ తో బాటు అమెజాన్ ప్రైమ్ వీడియోస్ పై కూడా ఎఫ్ ఐ ఆర్ పెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ సిరీస్ లో యూపీ రాష్ట్రాన్ని కించపరిచే విధంగా కొన్ని సన్నివేశాలు ఉన్నట్టు చతుర్వేది తెలిపారు. గత ఏడాది కూడా ఈ వెబ్ సిరీస్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. మరి ఈ వెబ్ సిరీస్ యాజమాన్యం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: