రాజమౌళి దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ పేట్రియాటిక్ సినిమా ఆర్ఆర్ఆర్. రాంచరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో సముద్రఖని, రాహుల్ రామకృష్ణ, శ్రియా శరణ్, అజయ్ దేవగన్ తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. డివివి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య దాదాపు రూ. 500 కోట్ల రూపాయల భారీ వ్యయంతో అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మిస్తున్న ఈ సినిమాకి కీరవాణి మ్యూజిక్ అందిస్తుండగా సాయిమాధవ్ బుర్రా మాటలని, విజయేంద్రప్రసాద్ కథని, సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫీని అందిస్తున్నారు.

ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తో పాటు హీరోలు ఇద్దరి ఫస్ట్ టీజర్స్  ప్రేక్షకాభిమానుల నుంచి విపరీతమైన స్పందన రాబట్టి మూవీపై భారీస్థాయిలో అంచనాలు క్రియేట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎంతో గ్రాండ్ లెవల్లో జరుగుతుంది. ఇక రాబోయే గణతంత్ర దినోత్సవం నాడు ఈ మూవీ నుండి ఒక ప్రత్యేకమైన సాంగ్ రిలీజ్ కానుందని కొద్ది రోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అవుతున్నాయి.

ఇక నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీహెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా యొక్క థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ కోసం ఒక పవర్ఫుల్ డేట్ ని ఎంపిక చేసిందట మూవీ యూనిట్. ఈ ఏడాది తెలుగు సంవత్సరాది అయిన ఉగాది పండుగ నాడు ఏప్రిల్ 13న ఈ మూవీ యొక్క థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ కానుందట. అతి త్వరలో దీనికి సంబంధించి అఫీషియల్ న్యూస్ కూడా వెలువడనుందట. మరోవైపు ట్రైలర్ సీన్స్ కట్ కు సంబంధించిన వర్క్ అతి త్వరలో ప్రారంభం కానుందని దానికోసం పలువురు బృందం ఎంతో శ్రమించనుందని అంటున్నారు. బాహుబలి రెండు భాగాల విజయాల తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో దేశ విదేశాల్లోని ప్రేక్షకుల్లో కూడా ఈ మూవీపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమైతే మాత్రం ఇది నిజంగా ఆర్ఆర్ఆర్ మూవీ ఫ్యాన్స్ కి పెద్ద పండుగ న్యూస్ అని చెప్పక తప్పదు......!!

మరింత సమాచారం తెలుసుకోండి: