ఇటీవల స్టార్ మా ఛానల్ లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 4 షో కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ లభించిన విషయం తెలిసిందే. అలానే ఈ షోకి ఎప్పటికప్పుడు భారీగానే టిఆర్పి రేటింగ్స్ లభించాయని ఇక గ్రాండ్ ఫినాలే రోజున జరిగిన ఎపిసోడ్ కి అత్యధిక స్థాయి రేటింగ్ లభించినట్లు ఇటీవల స్టార్ మా యాజమాన్యం ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ తాజ సీజన్లో విన్నర్ గా అభిజిత్ దుద్దాల విన్నర్ గా నిలవగా రన్నర్ గా అఖిల్ సార్థక్ నిలిచాడు. గ్రాండ్ ఫినాలే రోజున ఈ షో కి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి విన్నర్ అభిజిత్ కి ప్రత్యేకంగా షీల్డ్ అందించి అభినందించారు.

ప్రేక్షకాభిమాన లు తనపై కనబరిచిన  ప్రేమాభిమానాలు అలాగే తనకు వేసిన భారీ ఓట్ల మెజారిటీని తాను ఎప్పటికీ మర్చిపోలేనని విజేతగా కేవలం బిగ్ బాస్ షో లోనే కాకుండా మీ అందరి హృదయాలను గెలుచుకోవడం కూడా ఎంతో ఆనందంగా ఉంది అంటూ సీజన్ ముగిసిన అనంతరం పలు ఇంటర్వ్యూలలో ఇటీవల అభిజీత్ మాట్లాడుతూ చెప్పారు. అంతకు ముందు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా ద్వారా నటుడిగా టాలీవుడ్ కి పరిచయమైన అభిజిత్ ఆపై పెళ్లిగోల వెబ్ సిరీస్ ద్వారా మరింత క్రేజ్ దక్కించుకున్నాడు. ఇక బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ గా గెలవడంతో అతడికి ప్రస్తుతం వరుసగా పలు సినిమాలు, వెబ్ సిరీస్ లలో వరుసగా అవకాశాలు వస్తున్నట్లు సమాచారం. ఈ తాజా సీజన్ లోని ఒక ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ యొక్క బంధువులు రావడం, ఆ సమయంలో మోనాల్ చెల్లి హేమాలి ఆమెను చూడటానికి వచ్చిన విషయం తెలిసిందే.

ఆ సందర్భంలో, మీరు మా అక్క గురించి ఏదైనా మాట్లాడదలిస్తే ముందు నుంచి మాట్లాడండి అంటూ మీపై సరదాగా ఒక సెటైర్ విసిరింది కదా హేమాలి, ఆ తర్వాత పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఆ విషయమై పలు పోస్టులు వైరల్ అయ్యాయి అంటూ ఈ విషయాన్ని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ అడగగా, నిజానికి తనకి జరిగిన ఆ మ్యాటర్ అంతగా గుర్తులేదని మోనాల్, హేమాలి మాత్రమే కాదు హౌస్ మేట్స్ ప్రతి ఒక్కరూ అలానే వారి బంధువులు అందరూ తన కుటుంబ సభ్యులు వంటివారిని దయచేసి అప్పుడేదో జరిగిన ఎంతో చిన్న విషయాలను పెద్దవి చేసి వివాదాలు సృష్టించవద్దని ఇకపై కూడా ఈ విధమైన ప్రచారాలు చేయవద్దని అందరినీ కోరుతున్నట్లుగా చెప్పారు అభిజిత్. ఇక ఒక్కసారిగా మోనాల్ అలానే ఇతర హౌస్ మేట్స్ గురించి ఎంతో పాజిటివ్ గా స్పందించి మాట్లాడిన అభివృద్ధిపై పలువురు మోనాల్ అభిమానులు ప్రశంసలు కురిపిస్తూ సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ పలు మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: