ఒక సినిమాకు కధ ప్రాణం. ఆ కధను జాగ్రత్తగా తెర మీద నెరేట్ చేస్తూ డైరెక్టర్ చేసే మ్యాజిక్కులతోనే సినిమా హిట్ అన్నది ఆధారపడి ఉంటుంది. సినిమాలోకి ఆడియన్స్ కి కంప్లీట్ గా లీనం అయ్యేలా చూసేవాడే సక్సెస్ ఫుల్ డైరెక్టర్.

ఆ విధంగా ఆలోచిస్తే టాలీవుడ్ లో ఎందరో టాలెంటెడ్ డైరెక్టర్స్ ఉన్నారు. కానీ అందరిలో రాజమౌళి స్టైల్ వేరు. ఆయన సినిమా ఒక్కటి చాలు పది సినిమాలకు సరి సాటి. రాజమౌళి బాహు బలి తరువాత తీస్తున్న మళ్టీ స్టారర్ ఆర్.ఆర్.ఆర్ మూవీ మీదనే ఇపుడు మొత్తం ఆల్ ఓవర్ ఇండియా కన్ను ఉంది. ఈ మూవీ నిజమైన మల్టీ స్టారర్.

అంతే కాదు అటు నందమూరి, ఇటు మెగా ఫ్యామిలీని కలిపి అరుదైన ఫీట్ నే రాజమౌళి చేస్తున్నారు. అంతే కాదు, అటు కొమరం భీమ్, ఇటు అల్లూరి సీతారామరాజు పాత్రలను కూడా కలిపి చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెర తీస్తున్నారు. ఈ మూవీ  ఇద్దరు హీరోలు ఎంటీయార్, రాజమౌళిలకు చాలెంజ్ గానే ఉంటుంది అంటున్నారు.

అటు అల్లూరి పాత్రలో రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎంటీయార్ ఒదిగిపోతారని అంటున్నారు. ఈ రెండు పాత్రలు ఇద్దరు హీరోలూ రాజమౌళి డైరెక్షన్ ఆకాశమే హద్దుగా బడ్జెట్. ఇది చాలు మూవీ సూపర్ డూపర్ హిట్ అని చెప్పడానికి అంటున్నారు. ఇక ఈ సినిమాలో కీలకమైన పతాక సన్నివేశాలను తీస్తున్నారు. క్లైమాక్స్ సినిమాకు ప్రాణం అంటున్నారు. ఇద్దరు హీరోల మీద ఇపుడు అదిరిపోయే రేంజిలో క్లైమాక్స్ సీన్స్ తీస్తున్నారుట. స్వయంగా  రాజమౌళి యాక్షన్ ఎపిసోడ్స్ కి కొరియోగ్రఫీ చేస్తున్నారు అంటున్నారు. ఇదే ఏడాది రిలీజ్ అయ్యే ఆర్.ఆర్.ఆర్ మూవీ సరికొత్త రికార్డుకు క్రియేట్ చేయడం ఖాయమని అంటున్నారు.మరి ఎప్పుడెప్పుడా అని ఈ మూవీ కోసం నందమూరి మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: