భారీ అంచనాల మధ్య విడుదలైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. సంక్రాంతి సందర్భంగా 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. ఇక ఈ సినిమా భారీ నష్టాలని చవి చూస్తోందని అంటున్నారు. దీంతో ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన అను ఇమ్మానియేల్ రెమ్యునరేషన్ లో సినిమా యూనిట్ లో కోత విధించింది అనే టాక్ వినిపిస్తోంది. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అను ఇమ్మానియేల్ నటించడానికి ముందు 75 లక్షల రెమ్యునరేషన్ మాట్లాడుకున్నారట. 

అయితే ఈ సినిమా షూటింగ్ కి ముందు 50 లక్షలు ఇస్తామని మాట్లాడుకున్న యూనిట్ అలాగే 50 లక్షల చెక్కు అందించింది అట. కానీ ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయిన కారణంగా భారీ ఎత్తున నష్టాలు వస్తున్నాయని అంటున్నారు. దీంతో మిగిలిన పాతిక లక్షలు మీకు ఇవ్వలేమని నిర్మాతలు అను ఇమ్మానియేల్ కు తేల్చి చెప్పేశారట. అంటే 75 లక్షలు మాట్లాడుకుని 50 లక్షలకే ఈ సినిమాని ఇమ్మానియేల్ చేసినట్లయింది.


కానీ ఈ సినిమా సక్సెస్ మీట్ పెట్టినప్పుడు మాత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తండ్రి బెల్లంకొండ సురేష్సినిమా మంచి టాక్ తెచ్చుకుందని శాటిలైట్ రైట్స్ తోనే నిర్మాతలు బయట పడిపోయారు అని చెప్పుకొచ్చారు. అలాంటిది ఈ సినిమాలో నటించిన హీరోయిన్ రెమ్యునరేషన్ లో కోత పెట్టడం అనే అంశం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఇక ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన నబా నటేష్ నటించగా సోనూ సూద్ సరసన అను ఇమ్మానుయెల్ నటించింది. అయితే ఈ రెమ్యునిరేషన్ కోత విషయంగా టాలీవుడ్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: