రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఆర్నబ్ గోస్వామితో టీవీ చానల్ రేటింగ్ సంస్థ బార్క్ సీఈవో గుప్త జరిపిన వాట్సాప్ సంభాషణ ఇప్పుడు కలకలం రేపుతోంది. ఇప్పటికే బార్క్ సంస్థ రిగ్గింగ్ చేసి తమకు ముడుపులు ఇచ్చిన చానళ్లకు అనుకూలంగా రేటింగ్స్  ఇస్తోందని తేల్చేశారు ముంబై పోలీసులు. అయితే ఈ వివాదం ఇప్పుడు తెలుగు టీవీ ఛానల్స్ దాకా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతానికి జైల్లో ఉన్న గుప్త ని పోలీసులు దీనికి సంబంధించి విచారణ చేస్తున్నారు. 

ఈ విచారణలో భాగంగా తెలుగు టీవీ ఛానల్స్ కు సంబంధించిన కొన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి అని అంటున్నారు. ముఖ్యంగా తెలుగులో ఏబీఎన్, టీవీ 5 లాంటి కొన్ని ఛానళ్లకు కావాలనే రేటింగ్స్ తగ్గించారని పోలీసులు గుర్తించినట్లు చెబుతున్నారు. అలాగే టీవీ9, సాక్షి లాంటి ఛానళ్లకు కావాలనే రేటింగ్స్ పెంచి ఇచ్చారని పోలీసుల విచారణలో తేలిందని అంటున్నారు. దీనికి సంబంధించి కొన్ని ఈమెయిల్ సంభాషణలు కూడా పోలీసుల దృష్టికి వచ్చాయని మీడియా సర్కిల్స్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 

అంటే ఒక రకంగా కొన్ని పొలిటికల్ వర్గాలకు చెందిన టీవీ ఛానళ్లకు కావాలనే రేటింగ్స్ పెంచి ఇచ్చారని అలాగే కొన్ని వర్గాలకు చెందిన మీడియా చానెల్స్ రేటింగ్స్ తగ్గించారని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతానికి ఈ కేసుని ముంబై పోలీసులు సీరియస్ గా తీసుకున్న కారణంగా అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ తెలుగు టీవీ ఛానల్స్ కు సంబంధించిన స్కామ్ కూడా బయట పడితే ఇది రాజకీయంగా మరింత చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంది. చూడాలి మరి ఏమవుతుంది అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: