మన సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది అగ్రహీరోలు వారి హీరోయిజంతో పాటు విలనిజం ను కూడా చూపించి, ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశారు. అయితే వారు కేవలం ఈ రెండు గెటప్ లలోనే కాకుండా లేడీ గెటప్ లో  కూడా నటించి, ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. అయితే ఆ హీరో లు ఎవరు? వారు ఏ సినిమాలలో లేడీ గెటప్ వేశారో? ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం.

1. కమల్ హాసన్ :
విశ్వ నటుడుగా పేరు ప్రఖ్యాతులు పొందిన కమలహాసన్ టాలీవుడ్ లోని ప్రఖ్యాత నృత్య కళాకారులలో ఒకరు. కమల్  సినిమాలలో  ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసి నటించగలడు. తన నటనా నైపుణ్యంతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసే వాడు. ఇక కమల్ హాసన్ "భామనే సత్యభామనే" చిత్రంలో భామ పాత్రలో కనిపించాడు. ఈ సినిమాలో  లేడీ దుస్తులలో కనిపించి, ప్రేక్షకులను కళ్ళు తిప్పుకోకుండా చేశాడు. అంతేకాకుండా దశావతారం సినిమాలో కూడా లేడీ గెటప్ వేసి ప్రేక్షకుల్ని మెప్పించాడు.

2. చిరంజీవి :
చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే. చిరంజీవి టాలీవుడ్ లో యాక్షన్ తో పాటు తాను చేసే డాన్స్లతో  కూడా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. చంటబ్బాయి చిత్రంలో అందమైన లేడీ గెటప్ వేసి ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేశాడు.

3. రాజేంద్ర ప్రసాద్:
యాక్షన్ తో పాటు కామిక్ సారాంశంతో ఏ పాత్రకైనా పూర్తి న్యాయం చేయగలిగిన రాజేంద్రప్రసాద్ మేడం, వివాహభోజనంబు,ఆల్రౌండర్ చిత్రాలలో లేడీ గెటప్ వేసి ప్రేక్షకులను మెప్పించాడు.

4.నరేష్:
టాలీవుడ్ లోని ఉత్తమ నటులలో ఒకరైన నరేష్ ఎన్నో చిత్రాలలో నటించి, తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక చిత్రం భళారే విచిత్రం సినిమాలో లేడీ గెటప్ వేయగా, ఈ చిత్రం అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

5.మంచు మనోజ్ కుమార్:
యంగ్ అండ్ డైనమిక్ హీరోలలో మంచు మనోజ్ ఒక్కడు. మనోజ్ పాండవులు పాండవులు తుమ్మెద చిత్రంలో మోహిని అనే లేడీ గెటప్ లో కనిపించాడు. ఈ గెటప్ కి గాను అతనికి ప్రశంసల వర్షం కురిసింది.

6.సుమంత్:
ఇక సుమంత్  "ఏమో గుర్రం ఎగురవచ్చు" అనే సినిమాలో  చీర కట్టు వయ్యారాలు ఒలకపోస్తూ డాన్స్ చేశాడు.

7.అల్లు అర్జున్:
అల్లు అర్జున్ కూడా గంగోత్రి సినిమాలో లేడీ గెటప్ లో కనిపించి, ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేశాడు.

ఇక వీరితో పాటు అలీ, వెంకటేష్,అల్లరి నరేష్ లు కూడా లేడీ గెటప్ లలో కనిపించి ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: