భారతీయ చలన చిత్ర పరిశ్రమలోనే  ఆర్చరీ నేపథ్యంలో వస్తున్న తొలి  చిత్రం 'లక్ష్య'. ఇందులో నాగశౌర్య హీరోగా, కేతికా శర్మ హీరోయిన్‌గా నటిస్తున్నారు . ఇక  ఈ సినిమాను ధర్రేంద్ర సంతోష్ జాగర్లపూడి తెరకెక్కిస్తున్నారు. వెంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా లక్ష్య సినిమాని నిర్మిస్తుండడం విశేషం .. అయితే ఈరోజు హీరో నాగశౌర్య పుట్టినరోజు సందర్భంగా తాజాగా మూవీ టీం 'లక్ష్య సినిమా టీజర్ ని విడుదల చేసి హీరోకి బర్త్ డే గిఫ్ట్ గా ఇచ్చింది . ఇందులో నాగశౌర్య రెండు విభిన్నమైన గెటప్‌లో కనిపించడం విశేషం . అందులో ఒకటి నేచురల్ లుక్ కాగా.. మరొకటి 8 ప్యాక్ గెటప్. ఈ గెటప్ లో నాగశౌర్య ని చూస్తే జిమ్ లో బాగానే శ్రమించినట్లు తెలుస్తుంది

ఆరంభం నుంచే విలక్షణ కథలను ఎంచుకుంటూ టాలీవుడ్లో అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న యంగ్ హీరో నాగశౌర్య. 'ఊహలు గుసగుసలాడే' నుంచి చాలా తక్కువ సమయంలోనే ఇరవై సినిమాలు చేస్తూ జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు .. నాగశౌర్య తాను నటించిన సినిమాలకు కథలను రాయడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తుండగా అందులో 'లక్ష్య' ఒకటి...  

ఈ టీజర్ జగపతి బాబు వాయిస్ ఓవర్ తో మొదలై మధ్యలో వచ్చే సంభాషణలతో ఆద్యంతం ఆకట్టుకుంది ..ఈ చిత్రంలో జగపతి బాబు రోల్ కథను మలుపుతిప్పేదిగా ఉంటుందని టాక్. అతిత్వరలో చిత్ర రిలీజ్ డేట్ ప్రకటిస్తామని మూవీ టీం చెబుతుంది . ఇకపోతే ఇందులో వచ్చే 'పడిలేచిన వాడితో పందెం చాలా ప్రమాదకరం' అనే డైలాగ్ సినిమాపై ఉన్న అంచనాలు  పెంచేయడం విశేషం .. ఇక ఆర్చరీ నేపథ్యం లో వచ్చే మొదటి చిత్రం కావున ప్రేక్షకులను ఏ విధంగా అలరిస్తుందో వేచి చూడాలి ..


మరింత సమాచారం తెలుసుకోండి: