స్టైలీష్  స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పుష్ప’ మూవీ బన్నీ ఫ్యాన్స్ లో రోజురోజుకు ఆసక్తిని పెంచుతోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఫుల్ యాక్షన్ సీన్స్ తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా మొత్తం చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవులలో జరుగుతున్న ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారం గురించే  తెలుపనుంది. కాగా ప్రస్తుతం ఈ సినిమా తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో షూటింగ్ ను జరుపుకుంటోంది. వీలైనంత తొందరగా షూటింగ్ ను కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఈ చిత్ర యూనిట్ పనులను శరవేగంగా జరుపుతోంది. ఈ మూవీ పోస్టర్ ఇప్పటికే బన్ని అభిమానుల్లో, సినీ ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించింది. ఎప్పుడెప్పుడు ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఆశగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఈ మూవీకి సంబంధించిన ఒక టాపిక్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. పుష్ప బడ్జెట్ ఎంత ఉంటుందనే విషయమే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. ‘పుష్ప’ కు రూ.180 కోట్ల రూపాయల బడ్జెట్ ను కేటాయించినట్టు సమాచారం. కాగా ఈ బడ్జెట్ లో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ షేర్లే ఎక్కువగా ఉన్నాయని సమాచారం. ఈ బడ్జెట్ లో సుకుమార్ కు రూ.25 కోట్లు అందనుండగా.. బన్నికి తన వాటాగా రూ.40 కోట్లను ఇంటికి పట్టుకెళ్లనున్నాడట. దీనితో పాటుగా ఈ సినిమా రిలీజ్ అయ్యాక వచ్చే లాభాల్లో కూడా ఈ ఇద్దరు వాటా తీసుకోనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.  అయితే ఈ పాన్ ఇండియా సినిమాకు భారీ పారితోషికం  తీసుకునే నటీనటులు కూడా ఉన్నారట.

 వీరితో పాటుగా హై క్వాలీఫైడ్ టెక్నీషియన్స్  కూడా ఈ సినిమా కోసం పనిచేస్తున్నారట. అందుకోసమే పుష్ప సినిమాను కేవలం 150 రోజుల్లో కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తోందట ఈ సినిమా యూనిట్. ఈ అందరి నటీనటుల రెమ్యూనరేషన్ కు , షూటింగ్ ఖర్చులను కలిపి మొత్తంగా పుష్ప కు రూ.180 కోట్ల బడ్జెట్ అయ్యిందని తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా విషయంలో సుకుమార్ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట. కాగా ఈ సినిమా బడ్జెట్ ఇంకా పెరిగే అవకాశం కూడా లేకపోలేదని తెలుస్తోంది. ఈ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా 2022 లో సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుందని తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: