టాలీవుడ్‌లో స‌న్న‌జాజి తీగ లాగా త‌ళుక్కున మెరిసి మాయ‌మైన హీరోయిన్ల లిస్టులో బాలీవుడ్ భామ సోనాల్ చౌహాన్ కూడా ఉంటుంది. ఆమెను ఆదుకున్న హీరోలు , ఛాన్స్ ఇచ్చిన వాళ్లు ఎంతో మంది ఉన్నా ఆమె మాత్రం ఆ ఛాన్స్ అంది పుచ్చుకోలేక రేసులో వెన‌క‌ప‌డిపోయింది. స్టార్ హీరో బాల‌య్యే ఆమెకు ఒక‌టి రెండు కాదు.. ఏకంగా మూడు సినిమాల్లో ఛాన్సులు ఇచ్చాడు. బాల‌య్య బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ లెజెండ్ సినిమాలో ఆమె న‌టించింది. ఆ సినిమాలో ఆమె త‌న గ్లామ‌ర‌సం బాగానే వ‌ల‌క‌బోసింది.

ఆ త‌ర్వాత డిక్టేట‌ర్ సినిమాలోనూ కాస్తో కూస్తో ప్రాధాన్య‌త ఉన్న పాత్ర‌లోనే ఆమె న‌టించింది. మ‌ధ్య‌లో రామ్ పండ‌గ చేస్కో సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా ఎలాంటి ప్రాధాన్యం లేని రోల్ చేసింది. ఆ సినిమా హిట్ అయినా ఆమెను ఎవ్వ‌రూ గుర్తించ లేదు. ఆ త‌ర్వాత బాల‌య్య ముచ్చ‌ట‌గా మూడోసారి రూల‌ర్ సినిమాలో తో ఛాన్స్ ఇచ్చాడు. ఆ సినిమా డిజాస్ట‌ర్ అయ్యాక ఆమెను ప‌ట్టించుకునే వాళ్లే లేకుండా పోయారు. ఈ సినిమాల్లో సోనాల్ ఎన్నోసార్లు ఎక్స్ పోజింగ్.. బికినీ ట్రీట్ ఇచ్చినా అవేవి మ‌న వాళ్ల‌కు గుర్తు లేదు.

దీంతో ఆమె సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ వేడెక్కించే ఫొటోల‌తో ప్రేక్ష‌కులు, అటు సినిమా వాళ్ల దృష్టిలో ఉండేందుకు తాప‌త్ర‌య ప‌డుతోంది. ఈ గ్లామ‌ర్ ఫొటోలు చూసి అయినా త‌న‌కు ఛాన్స్ ఇస్తార‌ని ఆమె ఆశిస్తోంది. తాజాగా ఆమె త‌న ప‌డ‌క‌గది ఫొటో రివీల్ చేసింది. ఇది సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవ్వ‌డంతో పాటు పెద్ద సెన్షేష‌న్ గా మారింది. ఇందులో మ‌త్తెక్కించే ఫొజులు ఇస్తూ క‌వ్విస్తోంది.

ఇంత ఘాటుగా ఆమె క‌వ్విస్తున్నా ఆమె వైపు ఎవ్వరూ చూడ‌ట్లేదు. ఇక ఇటు బాల‌య్య‌కు హీరోయిన్లు దొర‌క‌డం లేదు... చూస్తే గీస్తే మ‌ళ్లీ బాల‌య్య ఆమెను ఓ చూపు చూసి త‌న సినిమాలో ఛాన్స్ ఇస్తాడేమో ?  చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: