అప్కమింగ్ సినిమా "వరుడు కావలెను" టీజర్ ఈరోజు నాగశౌర్య బర్త్ డే సందర్భంగా విడుదలైంది. ఈ సినిమాలో నాగశౌర్య బడా వ్యాపారవేత్తగా నటిస్తున్నాడు. ఇటువంటి రోల్ లో నాగశౌర్య కనిపించడం ఇదే మొదటిసారి అని చెప్పుకోవచ్చు.

ఈ బర్త్ డే స్పెషల్ టీజర్లో, నాగశౌర్య మాత్రమే కనిపించాడు. స్టోరీకి సంబంధించిన హింట్స్ కూడా ఏ మాత్రం అందలేదు. నాగశౌర్యను స్టైలిష్ గా చూపిస్తున్నాడు దర్శకుడు. ఇది మ్యూజికల్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది.

నాగశౌర్య నటించిన "వరుడు కావలెను" మూవీను లక్ష్మి సౌజన్య డైరెక్ట్ చేస్తోంది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో నాగ వంశీ డైరెక్ట్ చేస్తున్నాడు. విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. వేసవి కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

వరుడు కావలెను షూట్ అనేది హైదరాబాద్ లో శరవేగంగా కొనసాగుతోంది. ఇందుకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ యాక్టివిటీస్ ను మేకర్స్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు.

"వరుడు కావలెను" మూవీలో రీతూ వర్మ నాగశౌర్యకు జోడీగా నటిస్తోంది.  "పెళ్లిచూపులు" సినిమాలో రీతూ వర్మ యాక్టింగ్ జనాలను ఆకట్టుకుంది. విజయ్ దేవరకొండతో రీతూ వర్మ కెమిస్ట్రీ అనేది బాగా వర్కవుటయింది. ఇప్పుడు నాగశౌర్యతో రీతూ వర్మ కెమిస్ట్రీ ఏ విధంగా ఉండబోతోందన్న ఆసక్తిని ఆడియెన్స్ కనబరుస్తున్నారు.

ఈ సినిమాను లేడీ డైరక్టర్ డైరెక్ట్ చేస్తుండడం కూడా ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ను మరింత పెంచుతోంది. "అలా మొదలైంది" రేంజ్ లో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా సాగుతుందా అన్న ఆలోచనలో ఉన్నారు ఆడియెన్స్.

మరోవైపు, నాగశౌర్య మరో ప్రాజెక్ట్ కోసం అనీష్ కృష్ణతో కలిసి వర్క్ చేయబోతున్నాడు. ఇందులో సింగింగ్ సెన్సేషన్ షిర్లే సెటియా నాగశౌర్యకు జోడీగా కనిపించబోతోంది.

ఇదిలా ఉంటే, నాగశౌర్య తన 23వ సినిమా టైటిల్ ను రివీల్ చేశాడు. "పోలీస్ వారి హెచ్చరిక" అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాని కేపీ రాజేంద్ర అనే నూతన దర్శకుడు డైరెక్ట్ చేయబోతున్నాడు. మహేష్ ఎస్ కోనేరు నిర్మిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: