ఎంతమంది బరిలో దిగినా, టాప్‌ హీరోలకి స్పెషల్ ఇమేజ్ ఉంటుంది. పెద్ద సినిమాలొస్తున్నాయంటే థియేటర్లకు పండుగొస్తుంది. కొన్నాళ్లుగా ఈ కలెక్షన్ల ఫెస్టివల్‌ని మిస్ అవుతోన్న టాలీవుడ్‌కి భారీ ఎనర్జీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు టాలీవుడ్‌ స్టార్లు. ఈ సమ్మర్‌ని మెగా సీజన్‌గా మార్చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇస్తున్నాడు అనగానే అభిమానుల హంగామా మొదలైంది. 'వకీల్‌సాబ్' కోసం చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్నారు. అయితే కరోనా లాక్‌డౌన్‌తో షూటింగులు ఆగిపోయి 'వకీల్‌సాబ్' 2020 నుంచి 2021కి షిఫ్ట్ అయ్యాడు. పోయిన సమ్మర్‌లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వచ్చే వేసవికి విడుదలవుతోంది.

'వకీల్‌సాబ్' షూటింగ్‌ ఇప్పటికే పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌ కూడా జరుగుతున్నాయి. సో వీలైనంత త్వరగా ఫస్ట్ కాపీ రెడీ చేసి, ఏప్రిల్‌లో 'వకీల్‌సాబ్'ని దింపెయ్యాలనుకుంటున్నారు దర్శకనిర్మాతలు. ఇక ఏప్రిల్‌ వరకు థియేటర్లు హండ్రెడ్‌ పర్సంట్ ఆక్యుపెన్సీతో రన్ అయితే, 'వకీల్‌సాబ్' ఓపెనింగ్స్‌ కూడా భారీగానే ఉంటాయని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు నిర్మాతలు.

చాన్నాళ్ల నుంచి వార్‌ ఫిల్మ్స్, యాక్షన్‌ స్టోరీస్‌తో బిజీగా ఉన్న ప్రభాస్, 'రాధేశ్యామ్‌'తో రొమాంటిక్‌ జానర్‌లోకి వచ్చాడు. రోమియో-జూలియట్, లైలా-మజ్ను, దేవదాస్-పార్వతి రేంజ్‌ లవ్‌ స్టోరీ అని మోషన్ పోస్టర్‌తోనే హింట్స్‌ ఇచ్చి, జనాల్లో బజ్ క్రియేట్ చేశాడు డైరెక్టర్ రాధాక్రిష్ణ కుమార్. ఈ సినిమా కూడా సమ్మర్‌లోనే రిలీజ్ కాబోతోంది.

సంక్రాంతి సినిమాలు వచ్చినా బాక్సాఫీస్‌కి ఈ కిక్ సరిపోట్లేదు అంటున్నారు ట్రేడ్ పండిట్స్. పెద్ద హీరోలు బరిలో దిగితేనే థియేటర్లకి మళ్లీ జోష్ వస్తుందని చెబుతున్నారు. ఈ ఎనర్జీ ఇవ్వడానికే సమ్మర్‌లో భారీ సినిమాలు బరిలో దిగుతున్నాయి.

చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటిస్తే మెగా ఫ్యాన్స్‌కి పండగొస్తుంది. తండ్రీ కొడుకులు కలిసి నటిస్తే థియేటర్లు కూడా షేక్ అవుతుంటాయి. ఈ ఎక్స్‌పీరియెన్స్ అందించడానికే కొరటాల శివ 'ఆచార్య' సినిమాని రెడీ చేస్తున్నాడు. రామ్ చరణ్‌ కూడా రీసెంట్‌గానే 'ఆచార్య' షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు. ఇక ఫుల్‌ స్పీడ్‌గా షూటింగ్‌ జరుపుకుంటోన్న ఈ సినిమా సమ్మర్‌కి వస్తుందని టాక్.



మరింత సమాచారం తెలుసుకోండి: