భారతదేశ చలన చిత్ర రంగానికి వందేళ్ళు నిండాయి. అయితే మన టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రారంభమై 89 యేండ్లు గడుస్తోంది. తెలుగులో మొదటిసారిగా 1931లో భక్త ప్రహ్లాద సినిమా వెండితెరకు ఎక్కింది. ఆ తర్వాత ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఐతే తెలుగు ప్రేక్షకులకు అద్భుతమైన చిత్రాలను అందించడంలో గొప్ప దర్శకధీరుల కృషి ఎంతగానో ఉంటుంది. మాయాబజార్, పాతాళ భైరవి వంటి అద్భుతమైన చలనచిత్రాలను అందించి కె.వి.రెడ్డి ప్రేక్షకుల మనసుల్లో ఆరాధ్యదైవంగా నిలిచిపోయారు. ఆయన తర్వాత ఎందరో గొప్ప దర్శకులు తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు. ప్రస్తుతం కొనసాగుతున్న దర్శకులలో కూడా గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరో ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాం.

ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నెంబర్ వన్ దర్శకుడు ఎవరని ప్రశ్నిస్తే వెంటనే మనకు ఎస్.ఎస్.రాజమౌళి గుర్తుకొస్తారు. ఎందుకంటే రాజమౌళి తెరకెక్కించిన ప్రతి సినిమా హిట్ అయింది. అపజయాలు లేకుండా కేవలం విజయాలతోనే దూసుకెళ్తున్న రాజమౌళి బాహుబలి సినిమాతో చెక్కు చెదరని రికార్డులు నెలకొలిపారు. ఆయన సృష్టించిన రికార్డులు మరేతర టాలీవుడ్ దర్శకుడు ఇప్పట్లో బ్రేక్ చేయలేడని చెప్పుకోవచ్చు.

రాజమౌళి తరువాత తెలుగులో కొరటాల శివ, అనిల్ రావిపూడి ఎక్కువ సక్సెస్ రేట్ తో ముందజలో ఉన్నారు. అనిల్ రావిపూడి రీసెంట్ గా తెరకెక్కిస్తున్న సినిమాలు సూపర్ హిట్స్ అవుతున్నాయి. దీనితో ఆయన ప్రస్తుత టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా నిలుస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అజ్ఞాతవాసి సినిమా తో భారీ డిజాస్టర్ అందుకున్నారు కానీ ఆయన తీసిన సినిమాల్లో చాలా వరకు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. త్రివిక్రమ్ కూడా గొప్ప దర్శకులలో ఒకరని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.

లెక్కల మాస్టర్ సుకుమార్ కూడా మైండ్ బ్లోయింగ్ చిత్రాలను తెరకెక్కిస్తారు. టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో ఆయన పేరు కచ్చితంగా ఉంటుంది. ఆర్య, రంగస్థలం, కుమారి 21 వంటి సరికొత్త సినిమాలతో సుకుమార్ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించి అందరికీ ఫేవరెట్ అయ్యారనే చెప్పుకోవాలి. డైరెక్టర్ సురేందర్ రెడ్డి, పూరి జగన్నాథ్, వెంకీ కుడుముల, గోపీచంద్ మలినేని కూడా మంచి హిట్ సినిమాలను తెరకెక్కిస్తూ ఉత్తమ దర్శకులుగా పేరు సంపాదిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: