కోలీవుడ్ హీరో  విజయ్ నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మాస్టర్’ ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీసు వద్ద కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో  సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైంది ..  తమిళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ భాషల్లోకి విడుదలైంది. సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది  ప్రస్తుతం కోలీవుడ్ నుంచి వస్తోన్న సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

ఇండియాతో పాటు విదేశాల్లోని ‘మాస్టర్’ మంచి వసూళ్లను రాబడుతోంది. విడుదలైన కొన్ని రోజుల్లోనే  200 కోట్ల క్లబ్‌లో ‘మాస్టర్’ చేరిపోవడం విశేషం. అయితే, ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ఇంకా  ఖరారు చేయలేదు  మరోవైపు, ఈ విజయాన్ని విజయ్ ఫ్యాన్స్ మాత్రం పండగ చేసుకుంటున్నారు.తమ హీరో సినిమా రూ.200 కోట్ల క్లబ్‌లో చేరి చరిత్ర సృష్టించిందని సంబరపడిపోతున్నారు.

ఇదిలా ఉంటే, మాస్టర్ సినిమా ఒక్క తమిళనాడులోనే 100 కోట్ల గ్రాస్‌ వసూలు చేసింది. తమిళనాడులో రూ.100 కోట్ల గ్రాస్ వసూలు చేయడం విజయ్‌కు వరుసగా ఇది నాలుగోసారి. అంతేకాదు, ఈ ఘనత సాధించిన ఏకైక తమిళ హీరో కూడా విజయ్ కావడం విశేషం . కేవలం తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా  అరబ్ దేశాల్లోనూ  ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతోంది. యూఏఈ బాక్సాఫీసు వద్ద ‘మాస్టర్’ సినిమా 15.32 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
 
మొత్తం మీద లాక్‌డౌన్ తరవాత విడుదలైన తొలి  తమిళ చిత్రం ‘మాస్టర్’ ఊహించని స్థాయిలో వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమాలో విజయ్‌కు విలన్‌గా  ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి నటించారు. వీరితో పాటు మాళవిక మోహనన్, ఆండ్రియా, అర్జున్ దాస్,  ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. జేవియర్ బ్రిట్టో నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.. ఇదే చిత్రాన్ని తెలుగులో ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై మహేష్ ఎస్. కోనేరు విడుదల చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: