గత నెల రోజులుగా ప్రముఖ నేపథ్య గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ సింగర్ సునీత గురించి ప్రతిరోజు అనేక వార్తా కథనాలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె ఎప్పుడైతే బిజినెస్ మ్యాన్ అయిన రామ్ వీరపనేని ని నిశ్చితార్థం చేసుకున్నానని ప్రకటించారో ఆ క్షణం నుంచి ఆమె పేరు మార్మోగుతోంది. ఆమె పెళ్లి చేసుకొని వారాలు గడుస్తున్నా ఇంకా ఆమె గురించి అనేక ఇంట్రెస్టింగ్ వార్తలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆమెకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. అది ఏంటంటే సింగర్ సునీతకు 2 సినిమాల్లో హీరోయిన్ గా నటించే అవకాశాలు వచ్చాయట. ఈ విషయాన్ని సునీత ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

జేడీ. చక్రవర్తి హీరోగా నటించిన గులాబీ సినిమాలోని "ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో" అనే పాటను సింగర్ సునీత పాడిన విషయం తెలిసిందే. అయితే ఈ మధురమైన పాటను తన గానామృతంతో పాడటంతో తెలుగు శ్రోతలంతా కూడా ఫిదా అయిపోయారు. నిజానికి గులాబీ సినిమా కి రామ్ గోపాల్ వర్మ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. అప్పుడే రాంగోపాల్ వర్మ సునీత తీయటి గాత్రం తో పాటు ఆమె అందానికి ఫిదా అయిపోయారు. ఒకరోజు ఆమె కి ఫోన్ చేసి తన సినిమాలో హీరోయిన్ గా నటించాలని కోరారు. కానీ సునీత అందుకు ఒప్పుకోలేదట. అయినా రామ్ గోపాల్ వర్మ ఆమెపై కోప్పడకుండా అనగనగా ఒకరోజు అనే సినిమా లో నటించిన ఊర్మిళ మంటోధ్కర్ కి డబ్బింగ్ చెప్పాలని పిలిచారు. దీనితో సునీత వెళ్లి డబ్బింగ్ చెప్పారు కానీ ఆమెకు హీరోయిన్ వాయిస్ కి సరిగా సింగ్ కాకపోవడంతో ఆమె వాయిస్ ని మళ్ళీ చేంజ్ చేశారు.

ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి కూడా సునీత అందానికి మంత్రముగ్దులై ఆమెకు హీరోయిన్ గా అవకాశం ఇచ్చారు. కానీ నటన అంటే తనకు ఇష్టం లేదని సునీత చెబుతూ ఈ ఆఫర్ ని కూడా సున్నితంగా తిరస్కరించారట. హీరోయిన్ కష్టాల్ని తాను దగ్గరనుంచి చూశానని.. అంతటి కష్టాన్ని, టెన్షన్ ని తాను భరించలేనని.. అందుకే హీరోయిన్ గా అవకాశాలు వచ్చినా కూడా రిజెక్ట్ చేశానని ఆమె అన్నారు. సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా తనకున్న ఫేమ్ చాలని.. హీరోయిన్ గా రాణించాలని తాను ఎప్పుడూ అనుకోలేదని ఆమె చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆఫర్స్ వస్తే చేస్తారా అని ఇంటర్వ్యూయర్ అడగగా.. తనకు ఏ ఆఫర్స్ అవసరం లేదని.. ఉన్నదాంతో తాను సంతోషంగా ఉంటానని చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: