సల్మాన్‌ ఖాన్ హెల్పింగ్‌ హ్యాండ్స్‌ లాక్‌డౌన్‌ తర్వాత కూడా కంటిన్యూ అవుతున్నాయి. లాక్‌డౌన్‌లో పేదలకి సాయం చేసిన సల్మాన్, ఇప్పుడు హీరోయిన్ చెల్లెలిని ప్రమోట్ చేస్తున్నాడు. ఇప్పటికే ఆ హీరోయిన్‌ని తన ఫ్యామిలీలో కలిపేసుకున్న సల్మాన్, ఇప్పుడామె చెల్లెలిని కూడా ఖాన్స్ కాందాన్‌లోకి ఆహ్వానం పలుకుతున్నాడు.  

బాలీవుడ్‌లో హీరోయిన్స్‌ని ఎంకరేజ్ చేయడంలో ముందుంటాడు సల్మాన్ ఖాన్. కెరియర్‌లో ఎంతమంది హీరోయిన్స్‌కి పుషప్‌ ఇచ్చిన సల్మాన్ ఇప్పుడు కత్రీనా కైఫ్ చెల్లెలు ఇసబెల్లా కైఫ్‌కి కూడా సపోర్ట్‌ చేస్తున్నాడు. ఇసబెల్లా, పుల్కిత్ సామ్రాట్ కాంబోలో వస్తోన్న 'సుస్వాగతం ఖుషామ్‌దీద్' సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు సల్మాన్.

కత్రీనా కైఫ్‌ కెరీర్‌ కొంచెం డల్‌ ఫేజ్‌లో ఉన్నప్పుడు సల్మాన్‌ ఖాన్ హెల్పింగ్ హ్యాండ్ ఇచ్చాడు. కత్రీనాకి యాక్టింగ్‌ రాదనే విమర్శలని కూడా పట్టించుకోకుండా సినిమాల్లో అవకాశం ఇచ్చాడు. దీంతో వీళ్లిద్దరి మధ్య సమ్‌థింగ్‌ సమ్‌థింగ్ ఉందనే కామెంట్స్‌ వచ్చినా వీటిని పట్టించుకోకుండా సల్మాన్ ఫ్యామిలీకి దగ్గరైంది కత్రీన.

సల్మాన్ ఖాన్ ఇంట్లో జరిగే ప్రతీ ఈవెంట్‌కి అటెండ్‌ అవుతుంది కత్రీనా కైఫ్. ఇక సల్మాన్ కాందాన్‌ కూడా ఫ్యామిలీ మెంబర్‌లాగే ట్రీట్‌ చేస్తుంది. ఈ రిలేషన్‌తోనే కత్రీనా కైఫ్ చెల్లెలు ఇసబెల్లా కైఫ్‌ని కూడా సపోర్ట్ చేస్తున్నాడట సల్మాన్. ఇక ఇసబెల్లా కూడా ఇప్పటికే మరో రెండు సినిమాలకి సైన్ చేసింది. అక్కలాగే స్టార్‌ రేస్‌కి దగ్గరవుతోంది. ఇక చెల్లెలికి వస్తోన్న సపోర్ట్ చూసి కత్రీన కూడా హ్యాపీగా ఫీలవుతోందట.

సల్మాన్ ఖాన్ కు బాలీవుడ్ లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన వెండితెరపై కనిపిస్తే చాలు ఫ్యాన్స్ అరుపులతో ఆ థియేటర్ అంతా మార్మోగిపోతుంది. ఫైట్స్.. యాక్టింగ్.. లోనే కాదు ఆయన మనసు కూడా గొప్పదే. సినీ ఇండస్ట్రీలో ఉండే వారిని తన కుటుంబ సభ్యులుగా భావించి.. వారు సమస్యల్లో ఉన్నప్పుడు అక్కున చేర్చుకుంటాడు సల్లూభాయ్.


మరింత సమాచారం తెలుసుకోండి: