ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...మాస్ మహా రాజా  రవితేజసంక్రాంతి కి విన్నర్ అనే చెప్పాలి. వరుస ప్లాపులతో సతమతమవుతున్న రవి తేజ తాజాగా నటించిన సినిమా "క్రాక్"..ఇక  ‘క్రాక్’ సినిమా విడుదలై ఇప్పటికి 12 రోజులు కావస్తున్నా ఇంకా కలెక్షన్ల వర్షం కురిపిస్తూనే ఉంది.12 వ రోజున కూడా ఈ చిత్రం 0.78 కోట్ల షేర్ ను రాబట్టడం విశేషం. గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘సరస్వతి ఫిలిమ్స్ డివిజన్’ బ్యానర్ పై బి.మధు నిర్మించగా తమన్ సంగీతం అందించాడు.అతను అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించిందని చెప్పొచ్చు. సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలైన ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా.. బ్లాక్ బస్టర్ గా కూడా నిలిచింది. 3 ఏళ్లుగా సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్న రవితేజకు ఈ చిత్రం పెద్ద రిలీఫ్ ఇచ్చిందనే చెప్పాలి. ‘డాన్‌శీను’, ‘బ‌లుపు’ వంటి బ్లాక్ ‌బ‌స్ట‌ర్స్ త‌ర్వాత `క్రాక్` చిత్రంతో రవితేజ గోపీచంద్ లు హ్యాట్రిక్ ను కూడా పూర్తి చేశారు.


ఇక ‘క్రాక్’ సినిమా కి  వరల్డ్ వైడ్ గా 18 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 12 రోజులకు గాను ఈ చిత్రం 30.11 కోట్ల షేర్ ను రాబట్టింది. 50 శాతం ఆకుపెన్సీతోనే ఈ రేంజ్ కలెక్షన్లను రాబట్టడం అంటే సాధారణ విషయం కాదు. ఇక ఈ చిత్రం కొన్న బయ్యర్స్ అంతా ఇప్పటికే ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అవ్వడం మరో విశేషం!ఈ చిత్రాన్ని కొనుగోలు చేసిన బయ్యర్లు ఇప్పటివరకూ 12కోట్ల వరకూ లాభాలు దక్కించుకున్నారు. ఇక గ్రాస్ పరంగా నిన్నటితో ఈ చిత్రం 50కోట్లను వసూలు చెయ్యడం జరిగింది.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: