మహేశ్ బాబు గ్లామర్‌ మాత్రమే కాదు, ఫిట్‌నెస్‌ లెవల్స్‌ కూడా ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్ చేస్తున్నాయి. గ్లామర్‌ సీక్రెట్‌ తెలుసుకోవడానికి వెతుకుతోన్న అభిమానులకి పెద్ద షాక్‌ ఇచ్చాడు ప్రిన్స్. రీసెంట్‌గా ఈ హీరో పోస్ట్‌ చేసిన వర్కవుట్ వీడియో తెగ వైరల్‌ అవుతోంది.

మహేశ్ బాబు ఏం తింటున్నాడు, ఏజ్‌ని ఎలా కవర్ చేస్తున్నాడు అని కామన్‌ ఆడియన్స్‌తో పాటు, ఇండస్ట్రీ జనాలు కూడా అడుగుతుంటారు. కొడుకు హీరోగా ఎంట్రీ ఇచ్చాక కూడా మహేశ్ బాబు గ్లామర్‌ తగ్గదనే కామెంట్స్‌ కూడా వినిపిస్తూనే ఉంటాయి. అయితే ఈ గ్లామర్‌ని కాపాడుకోవడానికి మహేశ్ బాబు చాలా కష్టపడుతున్నాడు.

మహేశ్ బాబు వయసు ఇప్పుడు 45 ఏళ్లు. కానీ ఇప్పటికీ థర్టీస్‌లో ఉన్నట్లే కనిపిస్తాడు. అయితే టీనేజ్‌ కొడుకున్నా మహేశ్ ఇంకా ప్రిన్స్‌లాగే కనిపించడానికి స్ట్రిక్ట్‌ లైఫ్‌ స్టేలే కారణమని చెప్పొచ్చు. ఈ హీరో షూటింగ్స్‌ ఉన్నా, లేకపోయినా వర్కవుట్స్‌కి మాత్రం బ్రేక్ ఇవ్వడం లేదు. రీసెంట్‌గా మహేశ్ బాబు పోస్ట్‌ చేసిన బాక్స్‌జంప్ వీడియోకి నెటిజన్స్‌ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

మహేశ్ బాబు ఫిట్‌నెస్‌కి ఇంత ప్రియారిటీ ఇస్తున్నాడు కాబట్టే, అంత గ్లామర్‌గా ఉండగలుగుతున్నాడు. ఏజ్‌ని కవర్‌ చేస్తున్నాడని కామెంట్ చేస్తున్నారు అభిమానులు. అలాగే సిక్స్‌ ప్యాక్‌ కూడా చూపించేస్తే ఇంకా బావుంటుందని ఫీమేల్‌ ఫ్యాన్స్‌ రిక్వెస్ట్‌ చేస్తున్నారు.

మొత్తానికి మహేశ్ బాబు తన అభిమానులకు గ్లామర్ సీక్రెట్ ఏంటో చెప్పేశాడు. తాను అంత ఫిట్ నెస్ గా ఉండేందుకు కారణాన్ని వీడియోలో చూపించి సర్ ప్రైజ్ చేశాడు. ఫ్యాన్స్ కూాడా చాలా ఆనందంగా ఉన్నారు. తమ అభిమాన చేసే వర్కవుట్స్ చూసి సంబరపడిపోతున్నారు. తాము కూడా అలానే ఫిట్ నెస్ మెయింటైన్ చేయాలని తాపత్రయపడుతున్నారు.

మహేశ్ బాబు ఫార్టీ ప్లస్ లో ఉన్నా.. ఆయన శరీరంలో ఎలాంటి మార్పులు కనిపించలేదు. ఆయన రోజురోజుకూ గ్లామర్ గా మారిపోతున్నాడే తప్ప.. ఏజ్ లో ఎలాంటి ఛేంజ్ కనిపించలేదు. కానీ ఆయన హెల్త్ సీక్రెట్ ఏంటో ఒక్క వీడియోతో బయటపడిపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: