తెలుగు చిత్ర పరిశ్రమలో ఇక సినిమాల జాతర ప్రారంభమైంది. దాదాపు సంవత్సరకాలం కరోనా కారణంగా తెలుగు చిత్ర పరిశ్రమ కూడా లాక్ డౌన్ లోనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు చిత్ర పరిశ్రమ, అటు థియేటర్ ఓనర్స్ భారీ నష్టాన్ని మూటగట్టుకున్నారు. ఇక ఆ పరిస్థితి మారనుంది రానున్న రెండు నెలలు వరుస సినిమాలతో  తెలుగు చిత్ర పరిశ్రమలో పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఇప్పటికే సంక్రాంతి పండుగకు భారీ అంచనాలతో రిలీజ్ అయిన "క్రాక్ "మూవీ," రెడ్ "మూవీ లు భారీ కలెక్షన్లతో, బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్ గా నిలిచాయి.

ఈ సంవత్సరం టాలీవుడ్ కు బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి ఎందుకంటే సంక్రాంతి బరిలో దిగిన రెండు సినిమాలు భారీ వసూళ్లను రాబట్టి దర్శక నిర్మాతలను లాభాల బాట పట్టించాయి . అదే ఊపుతో నిర్మాతలు సినిమాలను రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. చిన్న సినిమాలే అయినప్పటికీ భారీ అంచనాలతో, ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి . ఆ సినిమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

 ఈనెల 23వ తేదీన అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న బంగారు బుల్లోడు మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. చాలా రోజుల తర్వాత అల్లరి నరేష్ హీరోగా వస్తున్న మూవీ పై భారీ అంచనాలే ఉన్నాయి.
జనవరి 28 న సుమంత్ హీరోగా నటిస్తున్న "కపటదారి" సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

జనవరి 29 యాంకర్ ప్రదీప్  హీరోగా పరిచయం అవుతున్న '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' విడుదల కానుంది.

అందమైన ప్రేమకథగా వస్తున్న" ఉప్పెన' సినిమాను ప్రేమికుల రోజున ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.

ఫిబ్రవరి 12 న సందీప్ కిషన్ హీరోగా "ఏ 1 ఎక్స్‌ప్రెస్"  మూవీ రిలీజ్  కు సిద్ధంగా ఉంది
ఆది హరోగా  "శశి "మూవీ  ,  సతీశ్ వేగేశ్న సినిమా 'కోతికొమ్మచ్చి'  సినిమాలు కూడా అదే నెలలో రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు.

రిపబ్లిక్ డే కానుక  గా నాగార్జున హీరోగా "వైల్డ్ డాగ్" మూవీ ప్రేక్షకులను మెప్పించ డానికి సిద్ధంగా ఉంది. అయితే ఈ మూవీ 'నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజవుతుందని అంటున్నారు. కానీ  అధికారిక ప్రకటించలేదు.

ఇలా వరుస సినిమాలతో తమ అభిమాన హీరోలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: