బుల్లితెరపై బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సీజన్ బిగ్ బాస్ ద్వారా ఎంతోమంది ఫేమస్ అయిపోయారు. ఫైనలిస్టులుగా నిలిచిన వారితో పాటు మిగిలిన వారికి కూడా ఎనలేని క్రేజ్ వచ్చింది. ఇక వీరందరిలో అమ్మాయిల ఫాలోయింగ్ తెచ్చుకున్న కంటెస్టెంట్ అరియానా గ్లోరి. ఇంటి నుండి బయటకు వచ్చాక వరుస అవకాశాలు అందుకుంటున్న ఈ బోల్డ్ బ్యూటీ తాజాగా ఒక టాలీవుడ్ యంగ్ హీరో తో కలిసి రచ్చ చేసింది.

ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బిగ్ బాస్ షోకు రాక‌ముందు యాంక‌ర్‌గా పని చేసిన అరియానా పెద్ద‌గా గుర్తింపు తెచ్చుకోలేక‌పోయింది. ఇక రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ బాగా ఫేమస్ అయిపోయిన అరియానా తర్వాత బిగ్ బాస్ షో లోకి ఎంటర్ అవడంతో ఆమె దశ తిరిగిపోయింది. తన దృఢమైన ఆటతీరుతో అందరినీ మెప్పించింది. ఎవరూ ఊహించని విధంగా ఫైనల్స్ వరకు వచ్చేది శభాష్ అనిపించుకుంది. మొత్తానికి నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది కానీ ఇప్పుడు తాజాగా బయటకు వచ్చి ఫుల్ బిజీ అయిపోయింది. ఎన్నో ఇంటర్వ్యూలు సోషల్ మీడియా లైవ్ చాట్ లతో హల్ చల్ చేస్తోంది.

ఈ క్రమంలోనే సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించింది. ఇప్పుడు తాజాగా ఇదే నేపథ్యంలో ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్న అంటూ అరియానా పోస్ట్ చేసింది. టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ కలిసి ఒక ఫోటో దిగిన అరియానా తన ఇంస్టాగ్రామ్ ద్వారా ఒక పోస్ట్ షేర్ చేసింది. త్వరలోనే ఒక సర్ప్రైజ్ రాబోతోంది…. బిగ్ బాస్ తర్వాత నా జీవితంలో ఇది మరొక మరిచిపోలేని రోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గవిరెడ్డి శ్రీను గారికి థాంక్స్ రాజ్ తరుణ్ నువ్వు సూపర్ అసలు అని రాసుకొచ్చింది. ఏంటి ఏంటి ఆ సర్ప్రైజ్ అని అందరికీ ఆసక్తి నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: