బిగ్ బాస్ హౌస్ లో హారిక అలాగే అభిజిత్ బాండింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నిజానికి, అభిజిత్ తో మోనాల్ బాండింగ్ ను హైలైట్ చేయాలని బిగ్ బాస్ ఎంతగానో ప్రయత్నించాడు. కానీ, అభిజిత్ అలాగే మోనాల్ మధ్య మనస్పర్థలు ఎక్కువగా చోటుచేసుకున్నాయి.

ఈ ఇద్దరితో ఇక వర్కవుట్ కాదని భావించాక బిగ్ బాస్ అభిజిత్ కు క్లోజ్ గా ఉన్న క్యాండిడేట్స్ పై దృష్టి పెట్టాడు. మోనాల్ ఎలాగో అఖిల్ కు క్లోజ్ అవడం స్టార్ట్ చేసింది.

ఒకపక్క బిగ్ బాస్ అఖిల్ అలాగే మోనాల్ బాండింగ్ ను హైలైట్ చేస్తూనే మరోపక్క అభిజిత్ అలాగే హారికల ర్యాపోకు హైపివ్వడం స్టార్ట్ చేశాడు.

అభి కూడా హారికకు 'ప్లీజ్ స్పెండ్ టైం విత్ మీ' అని టిష్యూ పేపర్ పై రాయగా ఈ ఇష్యూను మరింతగా హైలైట్ చేశాడు హోస్ట్ నాగార్జున.

ఇలా ఈ ఇద్దరి మధ్య ర్యాపోను 'అభి-హారికల మధ్య ఎదో ఉంది' అని జనాలు అనుకునేలా ఎపిసోడ్ ను ఎడిట్ చేసినట్టు అర్థమవుతోంది.

ఇక హౌస్ నుంచి బయటికి వచ్చాక జనాలకు షాకిచ్చాడు అభిజిత్. హారిక తనకు చెల్లెలని క్లారిటీ ఇచ్చాడు. హారిక గురించి అభిని పదే పదే ప్రశ్నించడంతో అభికి డౌట్ వచ్చింది.

తాను హౌస్ లో కూడా ఎన్నో సార్లు హారికను 'సిస్టర్' అని పిలిచిన సందర్భాలు ఉన్నాయని స్పష్టం చేశాడు.

హారిక కూడా ఇంటర్వూస్ లో ఈ ప్రశ్నకు ఓపిగ్గా సమాధానం చెబుతోంది. అభితో తన బాండింగ్ బిగ్ బాస్ షో ఎడిటర్స్ కు నచ్చి ఉండవచ్చని అందుకే ఇలా హైలైట్ చేసి ఉంటారని క్లారిటీ ఇచ్చింది.

ఈ విషయంపై ప్రశ్నలేవైనా ఉంటే బిగ్ బాస్ ఎడిటర్స్ నే అడగాలని చెప్పుకొచ్చింది.

మొత్తానికి, "కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు" అన్న ప్రశ్న కన్నా "అభికి హారిక చెల్లెలేనా?" అన్న ప్రశ్న మరింత కన్ఫ్యూజన్ ను క్రియేట్ చేస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: