చందమామ మూవీతో యూత్ & ఫామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్న కాజల్ అగర్వాల్..ఆ తర్వాత వరుసగా అగ్ర హీరోల సరసన నటించి తెలుగు లో టాప్ ప్లేస్ దక్కించుకుంది. కేవలం తెలుగు లోనే కాక తమిళ్ లోను స్టార్ హీరోలకు జోడి కట్టి అక్కడ కూడా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. అక్టోబర్ 30 న ముంబైలోని తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ లో గౌతమ్‌ కిచ్లు ను వివాహం చేసుకుంది కాజల్. కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో మార్వాడీ సంప్రదాయ పద్దతిలో కాజల్ వివాహ వేడుక వైభవంగా జరిగింది. పెళ్లి తర్వాత కాజల్ సినిమాలకు దూరం అవుతుందేమో అని అభిమానులు డౌట్ పడ్డారు.

కానీ కాజల్ మాత్రం నెల రోజుల పాటు భర్త తో హనీమూన్ జరుపుకొని.. ఆ తర్వాత పెళ్లికి ముందు ఒప్పుకున్నా సినిమా షూటింగ్ లలో బిజీ అయ్యింది. మాములుగా ఏ హీరోయిన్ కైనా పెళ్లి అయితే సినిమా అవకాశాలు తగ్గుతాయి కానీ కాజల్ కు మాత్రం పెళ్లి తర్వాత కూడా వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి. ఇప్పటికే చిరంజీవి సరసన ఆచార్య మూవీ లో నటిస్తున్న ఈ భామ కు ముంబై సాగా, విజయ్ మురుగదాస్ దర్శకత్వంలో తుపాకి 2, తమిళ్ స్టార్ హీరో సూర్య.. మాస్ డైరెక్టర్ హరి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా లోని ఈమెకు ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తుంది.

అంతేకాదు విక్రమ్ హీరోగా తెరకెక్కబోయే కొత్త చిత్రంలోనూ కాజల్ ను ఎంపిక చేసారని తమిళ్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు ప్రముఖ డాన్స్ మాస్టర్, డైరెక్టర్, నటుడు ప్రభు దేవా సరసన నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కళ్యాణ్ అనే డైరెక్టర్ ప్రభుదేవా.. కాజల్ ను జంటగా పెట్టి ఓ రొమాంటిక్ కామెడీ తీయడానికి సిద్ధమవుతున్నాడట. ఇక ప్రభుదేవా సల్మాన్ ఖాన్ తో ‘రాధే’ సినిమా చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: