10 సంవత్సరాల క్రితం టాలీవుడ్ లో మినిమం గ్యారంటీ హీరోగా అల్లరి నరేష్ కొనసాగుతూ ఉండేవాడు. కనీసం సంవత్సరానికి రెండు సినిమాలు అతడి నుండి వచ్చేవి. అతడి సినిమాలు అన్నీ మినిమం బడ్జెట్ తో తీస్తారు కాబట్టి అతడి నిర్మాతలు సాధారణంగా నష్టపోరు అన్న నమ్మకం ఉండేది. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.


‘అల్లరోడి’ సినిమాలకు ప్రస్తుతం ఓపెనింగ్స్ రాని పరిస్థితి ప్రస్తుతం జనం ‘జబర్దస్త్’ లోని పంచ్ డైలాగులకు అలవాటు పడిపోవడంతో అల్లరి నరేష్ పంచ్ డైలాగ్ ల కామెడీని ఎంజాయ్ చేయలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఈరోజు విడుదల అవుతున్న ‘బంగారు బుల్లోడు’ ఎంతవరకు సక్సస్ అవుతుంది అన్న సందేహాలు ఇండస్ట్రీ వర్గాలలో ఉన్నాయి.


వాస్తవానికి అల్లరి నరేష్ ఈసినిమాకు బదులు ఇప్పటికే మంచి ఇమేజ్ తెచ్చుకున్న ‘నాంది’ ని ముందుగా విడుదల చేసి ఆతరువాత ‘బంగారు బుల్లోడు’ విడుదల చేస్తే బాగుండేది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ కు మంచి స్పందన రావడంతో ఈమూవీ ఖచ్చితంగా అల్లరోడికి టర్నింగ్ పాయింట్ అవుతుంది అన్న కామెంట్స్ వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ఈమూవీ వరల్డ్ నెగిటివ్ రైట్స్ మొత్తం జీటీవీ తీసుకోవడానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. అగ్రిమెంట్ పెండింగ్ లో ఉంది అన్న వార్తలు వస్తున్నాయి.


ఈమూవీని జీ 5 లో జీ టీవీలో విడుదల చేస్తారు. అలాగే థియేటర్లలో కూడా జీ టీవీనే విడుదల చేస్తుంది అని అంటున్నారు. ఈసినిమా పై అల్లరి నరేష్ కూడ మంచి హోప్ తో ఉన్నట్లు టాక్. కామెడీ పాత్రల నుంచి సీరియస్ పాత్రల వైపు మళ్లాలని నరేష్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాడు. ఆ ప్రయత్నాలకు ‘నాంది’ సహకరిస్తుంది అని అంటున్నారు. ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నరేష్ మాట్లాడుతూ రెండు సంవత్సరాలు తరువాత తాను దర్శకుడుగా మారే ఆలోచనలు చేస్తున్నాను అని చెప్పడం బట్టి నరేష్ తన స్ట్రాటజీలను మార్చుకునే ఆలోచనలు చేస్తున్నట్లు సంకేతాలు వస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: