ఎప్పటినుంచో కుటుంబ కథా చిత్రాలు మన ముందుకు వచ్చి ప్రేక్షకులలో ఎనలేని గుర్తింపు తెచ్చుకున్నాయి. అయితే అన్ని కుటుంబ చిత్రాలలోనూ కుటుంబం అంటే ఎలా ఉండాలి? వారి మధ్య ఆప్యాయతలు ఎలా ఉంటాయి? అని కళ్లకు కట్టినట్టుగా చూపించారు దర్శకలు.అందులో నటించే నటులు కూడా ఆ పాత్రలో లీనమైపోయి పాత్రలకు తగ్గ పూర్తి న్యాయం చేశారు.
అయితే ఆ సినిమా వివరాలు ఏంటో? ఇప్పుడు చూద్దాం.

1.  సంక్రాంతి:
2005 ఫిబ్రవరి 8న విడుదలైన సంక్రాంతి సినిమా సంక్రాంతి పండుగ కానుకగా విడుదల చేశారు. ఇక ఈ సినిమాలో వెంకటేష్,శివబాలాజీ,శ్రీకాంత్, శర్వానంద్ లు అన్నదమ్ముల పాత్రల్లో నటించి,  నిజజీవితంలో కూడా అన్నదమ్ముల అంటే ఇలాగే ఉండాలని చూపించారు.ప్రస్తుతం కూడా ఎప్పుడు సంక్రాంతి పండుగ వచ్చిన ఈ సినిమాను  టీవీ లో మనం చూస్తూనే ఉంటాం.

2. మనం:
2014 మే 23న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులందరికీ వేసవి తాపాన్ని తీర్చిందని  చెప్పవచ్చు. ఇక అక్కినేని నాగేశ్వరరావు ఫ్యామిలీ ఈ సినిమాలో  నటించి,  తరాలు మారినా బంధుత్వాలు మారవని చక్కగా చూపించారు.

3. బృందావనం:
 2010 అక్టోబర్ 14న విడుదలైన బృందావనం సినిమా అసలు సిసలైన కుటుంబ కథా చిత్రం. ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది.

4.  బొమ్మరిల్లు :
బొమ్మరిల్లు చిత్రం సరికొత్త కుటుంబకథా చిత్రంగా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను వసూలు చేసింది.

5.  సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు:
వెంకటేష్,మహేష్ బాబులు సంయుక్తంగా కలసి నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని చేకూర్చింది. ఈ సినిమాలో కుటుంబం అంటే ఎలా ఉంటుందో చూపించారు.

6.అత్తారింటికి దారేది:
ఈ చిత్రం లో కూతురు తన ప్రేమించిన వాడిని సొంతం చేసుకోవడానికి కుటుంబాన్ని సైతం వదిలి వెళ్తుంది. ఇక  కూతురు ఎప్పుడు తిరిగి వస్తుందా అని తండ్రి ఎదురు చూస్తాడు. కూతురి రాక కోసం తండ్రి నిరీక్షణ అనే నేపథ్యంలో ఈ కథ సాగుతుంది.  ఇక ఈ కథ మంచి విజయాన్ని చేకూర్చింది అని చెప్పవచ్చు.

7. సన్ ఆఫ్  సత్యమూర్తి:
ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్,అల్లు అర్జున్ లు  కలిసి నటించిన ఈ చిత్రం తండ్రి కోరికలను కొడుకు ఎలా తీర్చగాలిగాడు అనే నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. మంచి క్లాసికల్ హిట్  ఇచ్చింది ఈ సినిమా.

8. మిథునం :
కేవలం రెండే రెండు పాత్రలతో రూపొందించిన ఈ చిత్రం నిజజీవితంలో కూడా దంపతులు అంటే ఎలా ఉండాలో వీరిని చూసి నేర్చుకునేలా ఈ కథ సాగుతుంది. ఇక ఈ కథకు ఎన్ని పురస్కారాలు,అవార్డులు ఇచ్చినా తక్కువే.

9. మురారి:
మురారి సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఉమ్మడి కుటుంబాలు అంటే ఎలా ఉంటాయో? వాటిమధ్య ప్రేమానురాగాలు ఎలా పండించాలో ఈ సినిమాను చూసి నేర్చుకోవచ్చు.

10. శతమానం భవతి:
నిజజీవితంలో కనుమరుగైపోయిన అనుబంధాలను, ఆత్మీయతలను తెరపై చూసి ఆనందించాలనే  ఆకాంక్షకు ఈ  సినిమా ప్రాణం పోసింది.

ఈ సినిమాలు  అన్నీ ఎంతో అద్భుతమైన కథతో, మంచి కుటుంబ కథా చిత్రాలుగా రికార్డు సృష్టించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: