బాహుబలి మూవీతో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ రేంజ్ ఏంటన్నది ప్రత్యెకంగా చెప్పాల్సిన పనిలేదు. అన్ని భాషల అగ్ర దర్శకనిర్మాతలు ప్రభాస్ తో సినిమాలు చేసేందుకు పోటీ పడుతున్నారు. ప్రభాస్ సైతం ప్రస్తుతం వరుస పాన్ కథలపైనే ఫోకస్ చేసాడు. కాగా ప్రభాస్ గతంలో వద్దనుకున్నా కథను తమిళ్ హీరో సూర్య చేయబోతున్నాడనే వార్తలు ఫిలిం సర్కిల్లో వైరల్ గా మారాయి.

గత కొంతకాలంగా వరుస ప్లాప్స్ ఎదురుకుంటున్న తమిళ  హీరో సూర్య ఆకాశమే నీ హద్దురా మూవీతో సూపర్ హిట్ అందుకొని మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. సుధ కొంగర డైరెక్ట్ చేసిన ఈ మూవీ దీపావళి కానుకగా నవంబర్ 12 న అమెజాన్ ప్రైమ్ లో విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సక్సెస్ జోష్ తో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. కాగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను గతంలో ప్రభాస్ తో ఓ యాక్షన్ మూవీ చేద్దామని భావించాడు. ఈ మూవీ ని దిల్ రాజు నిర్మించేందుకు ముందుకు వచ్చాడు. అయితే కథ విన్న తర్వాత ప్రభాస్ నో చెప్పాడట. దీంతో ఆ మూవీ అక్కడే ఆగిపోయింది.

ప్రస్తుతం బోయపాటి శ్రీను,నందమూరి బాలకృష్ణతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఇది పూర్తి కాగానే ప్రభాస్ తో చేయాలనుకున్న మూవీని సూర్య తో చేయాలని ఫిక్స్ అయ్యాడట. రీసెంట్ గా ఆ కథ ను సూర్య కు వినిపించగా సూర్య ఓకే చెప్పినట్టు టాక్. సూర్య కూడా డైరెక్ట్ తెలుగు సినిమా చేయాలని ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలో బోయపాటి చెప్పిన హై వోల్టేజ్ యాక్షన్ స్టోరీ కరెక్ట్ గా సెట్ అవుతుందని ఫిక్స్ అయ్యాడట. ఈ మూవీ ని తెలుగు తో పాటు తమిళంలో నిర్మించాలని దిల్ రాజు భావిస్తున్నాడట.     

మరింత సమాచారం తెలుసుకోండి: