రేణు దేశాయ్ మంచి పొయెట్ ఆమె ఇంగ్లీష్ లో చాల భావుకత తో పొయిట్రీ వ్రాస్తుంది. తరుచూ ఆమె వ్రాసే కవితలను తన ఇన్ స్టా గ్రామ్ ఎకౌంట్ లో అందరికీ షేర్ చేస్తూ ఉంటుంది. పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని ఏర్పరుచుకోవడానికి ఆమె నిరంతరం కృషి చేస్తూ ఉంటుంది.


ఇలాంటి పరిస్థితులలో ఆమె లేటెస్ట్ గా వ్రాసిన ఒక కవితలోని భావం ఎవర్ని టార్గెట్ చేసే విధంగా ఉంది అంటూ సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఒకరి ప్రేమ ను నిజయితీగా పొందే అదృష్టంతో పాటు మన సన్నిహితులను ప్రేమగా చూసుకునే మనస్తత్వంతో పాటు ఒక మంచి భోజనం ఉంటే చాలు జీవితం సంతృప్తిగా వెళ్ళిపోతుంది అంటూ ఆమె కామెంట్స్ చేసింది.


ఇప్పుడు హఠాత్తుగా రేణు దేశాయ్ సంతృప్తి గురించి అదేవిధంగా ప్రేమను గురించి ఎందుకు మాట్లాడుతోంది ఆమెకు మళ్ళీ గతం గుర్తుకు వచ్చిందా అంటూ కొందరు రేణు మాటలలోని అర్థాలను వెతుకుతున్నారు. వాస్తవానికి రేణు పవన్ కళ్యాణ్ నుండి విడిపోయిన తరువాత తిరిగి బౌన్స్ బ్యాక్ అవ్వాలని చాల గట్టి ప్రయత్నాలు చేస్తోంది.


అయితే నిర్మాతగా దర్శకురాలిగా ఆమె చేసిన ప్రయత్నాలు అన్నీ చాలావరకు ఫెయిల్ అయ్యాయి. బుల్లితెర షోలకు జడ్జిగా ఆమె ఎంట్రీ ఇచ్చినా అక్కడ కూడ ఆమె పెద్దగా విజయవంతం కాలేదు. ఈమధ్య రేణు దేశాయ్ మహేష్  తో ‘సర్కారు వారి పాట’ లో మహేష్ కు వదినగా నటిస్తోంది అంటూ వార్తలు వచ్చాయి కానీ ఆ వార్తల పై ఎటువంటి క్లారిటీ లేదు. దీనికితోడు ఆమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించాలని ప్రయత్నాలు చేస్తున్నా ఆమెకు అవకాశాలు పెద్దగా రావడంలేదు ఇలాంటి పరిస్థితులలో ఆమె బాధతో ఇలా ఒక మంచి భోజనం ప్రేమ ఉంటే చాలని కామెంట్స్ చేసిందా లేదంటే ఆమె ఎదో మనసులో పెట్టుకుని పేరుపెట్టి ఎవర్ని టార్గెట్ చేయలేక ఇలా వ్యధను వెళ్ళబోసుకుందా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: