దేశీయ స్టాక్ మార్కెట్ తొలిసారిగా 50 వేల పాయింట్ల స్థాయిని దాటింది అంటూ మదుపర్లు పండుగ చేసుకున్న ఆనందం కేవలం ఒక్కరోజు పూర్తి కాకుండానే కరిగిపోయింది. 1979 లో 100 బేస్ పాయింట్లతో మొదలైన సెన్సెక్స్ గత 42 సంవత్సరాలలో 500 ల రెట్లు పెరిగింది. కరోనా సమయంలో కుదేలైన సెన్సెక్స్ ఎవరు ఊహించని విధంగా గత సంవత్సరం మార్చి 24తో పోల్చుకుంటే 95.4 శాతం పుంజుకుని ఎందరినో కోటీశ్వరులను చేసింది.


గ్లోబల్ మార్కెట్ లో సానుకూల సంకేతాలు విదేశీ ఫోర్టుపోలియో పెట్టుబడుల జోరు ఆశాజనకంగా కార్పురేట్ కంపెనీల క్యూ3 ఫలితాలు రాబోయే బడ్జెట్ లో భారీ సంస్కరణల అంచనాలతో ఒకేసారి పరుగులు తీసి 50 వేల మార్క్ ను అందుకుని కొన్ని గంటలు కూడ ఆ మార్క్ పై నిలబడకుండా మళ్ళీ నష్టాల వైపు షేర్లు పతనం కావడానికి గల ప్రధాన కారణం షేర్ మార్కెట్ లోని బడా ట్రేడర్లు లాభాల స్వీకరణ కోసం మొగ్గు చూపించడం. ఈ ట్రెండ్ నిన్నటిరోజు కూడ కొనసాగడంతో స్టాక్ మార్కెట్ సూచీలు మరింత పతనం అయ్యాయి.


ఇలాంటి పరిస్థితులలో రిటైల్ ఇన్వెష్టర్లు ఆచితూచి వ్యవహరించాలని స్టాక్ మార్కెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. విదేశీ దేశీయ సంస్థాగత ఇన్వెష్టర్లు గుమ్మరిస్తున్న పెట్టుబడుల వలన సూచీలు పరుగులు పెడుతున్నాయని రానున్న రోజులలో మార్కెట్ మరింత దిద్దుబాటుకు లోనయ్యే పరిస్థితులలో చిన్నతరహా మధ్య తరహా ఇన్వెష్టర్లు అతి జాగ్రత్తగా అడుగులు వేయాలని సూచనలు వస్తున్నాయి. రానున్న రోజులలో మార్కెట్ మరింత దిద్దుబాటు చర్యల వైపు అడుగులు వేసే పరిస్థితులలో చౌకగా లభించే నాణ్యమైన ఏ గ్రేడ్ కంపెనీ షేర్లలో పెట్టుబడులు పెడితే దీర్ఘకాలంలో మెరుగైన లాభాలు పొందవచ్చని విశ్లేషకులు సూచిస్తున్నారు. సెన్సెక్స్ ప్రారంభమైన 1979 లో 10 వేలు  పెట్టుబడిగా లిస్టెడ్ కంపెనీలలో పెట్టుబడిగా పెట్టినవారు పెట్టినవారి షేర్ విలున ఇప్పుడు 45,28,568 అని తెలిస్తే ఎవరైనా షాక్ అవుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: