1941వ సంవత్సరంలో ధర్మపత్ని సినిమాతో తన నట ప్రస్థానాన్ని ప్రారంభించిన అక్కినేని నాగేశ్వరరావు దాదాపు 78 ఏళ్ల పాటు ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు. చిత్ర పరిశ్రమకు ఎన్టీఆర్ కుడి కన్ను అయితే ఏఎన్ఆర్ ఎడమ కన్ను అని చెప్పుకోవచ్చు. వీళ్లిద్దరూ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ స్థాయిని విపరీతంగా పెంచేశారు. అక్కినేని నాగేశ్వరరావు దేవదాస్ సినిమాలో అత్యంత సహజంగా నటించి గొప్ప నటుడి గా పేరొందారు. దేవదాసు ఒక్కటే కాదు ప్రతి సినిమాలో ప్రతి పాత్రలో ఆస్కార్ అవార్డు విన్నింగ్ లెవల్లో అద్భుతమైన నటనా ప్రతిభ కనబరిచి 'నట సార్వభౌమ',  'నట రాజశేఖర', 'కళాప్రవీణ', 'అభినయ నవరస సుధాకర', 'కళా శిరోమణి', 'అభినయ కళాప్రపూర్ణ', 'భారతమాత ముద్దుబిడ్డ' వంటి ఎన్నో బిరుదులను పొందారు.

అలాగే చలన చిత్ర రంగానికి చెందిన ఎన్నో అవార్డులను కూడా కైవసం చేసుకున్నారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంతోకాలం సేవలు  చేసినందుకు గాను ఏఎన్ఆర్ 2011 లో రెండో అత్యున్నత పౌర పురస్కారమైన "పద్మ విభూషణ్" అవార్డును అందుకున్నారు. చలనచిత్ర రంగంలో అత్యుత్తమ పురస్కారమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును కూడా ఏఎన్ఆర్ అందుకున్నారు. పద్మ విభూషణ్ తో పాటు పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులను కూడా దక్కించుకున్నారు. నిజానికి ఈ 3 అత్యుత్తమ అవార్డులను తొలిసారిగా అందుకున్నది అక్కినేని నాగేశ్వర్ రావు గారే. అయితే "భారతరత్న" అనే గొప్ప పురస్కారం మాత్రం అక్కినేని నాగేశ్వరరావు ని వరించలేదు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అక్కినేని నాగేశ్వరరావు ని ఎన్నో సినిమా అవార్డులతో సత్కరించాయి.

అంతేకాదు ఆంధ్ర, నాగార్జున విశ్వవిద్యాలయాల నుంచి డాక్టరేట్ ను కూడా నాగేశ్వరరావు అందుకున్నారు. మరపురాని మనిషి' (1973), 'సీతారామయ్యగారి మనవరాలు' (1991), 'బంగారు కుటుంబం' (1994) చిత్రాలకు గాను ఉత్తమ నటునిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సాధించారు. పూర్తి అంకితభావంతో ప్రతి పాత్రలోనూ జీవించేసిన అక్కినేని నాగేశ్వరరావు తనువు చాలించడం నిజంగా చిత్రపరిశ్రమకు తీరని లోటని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: