దిల్ రాజు  అలియాస్ వి. వెంకట రమణారెడ్డి, తెలుగు నిర్మాత, పంపిణీదారుడు. శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ నిర్మాణ సంస్థను స్థాపించి తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించాడు. విజయవంతమైన “దిల్” సినిమా కారణంగా ఆయనకు “దిల్ రాజు” అనే పేరు స్థిరపడి పోయింది. నిజంగా చెప్పాలంటే ఆయన “నిండా దిల్” ఉన్నవారే.

ఒక చిన్న సినిమా పంపిణీదారుడుగా మొదలైన చిత్రరంగవ్యాపారంలో ఆయన అధిరోహించని శిఖరం బహుశ లేకపోవచ్చు ఇప్పుడాయన ఒక “టాలీవుడ్ కింగ్ పిన్” ఆస్థాయికి ఏదగటానికి దిల్ రాజు తొందర పడలేదు. అనుక్షణం కష్టపడ్డారు. సాధించారు. టాలీవుడ్ చిత్రరంగం చెన్నై నుంచి హైదరాబాద్ కు షిఫ్ట్ అయినప్పుడు సినిమా రంగంలోని మౌలిక సదుపాయాలు అన్నీ తన గుప్పిట్లో వుంచుకుని, తమ హీరోలను తామే తయారు చేసుకొని టాలీవుడ్ ను శాసించే ప్రణాళికను “ఆ నలుగురు” తో (కీర్తి శేషులు దాసరి నారాయణరావు గారు వీళ్ళలోని – మనిషితనం- జాగృతం చేయటానికి అనవరతం కృషి చేశారు)  పాటు కొందరు అమలు చేస్తే - ఎక్కడ సినిమా ఎలా? తయారయినా, చివరకు తమ దరికి చేరాల్సిందే.

సినిమా తుది గమ్యం “థియేటర్” అన్న “వైటల్ పాయింట్” అని గమనించి అక్కడే (తోట రాముడు రాజకుమారి కోసం, పాతాళభైరవి సినిమాలో కోటలో పాగా వేసినట్లు) వేరెవరో “పాషన్” తొనో, సినిమారంగంపై మమకారంతోనో, సినిమా తీసి విడుదలకోసం వీరి చేతిలో థియేటర్లు ఉండటం తో, వీరి దరికి వచ్చి కొలనులో చేపలు వలలోపడ్డట్లు, వీళ్ళ బుట్టలో పడితే, కోసి కూరొండి దాని సారాన్ని పీల్చి, ఆ నిర్మాతకు నరకయాతన ఏంతలా చూపొచ్చో చూపటానికి కాపేసి, అక్కడే  తమ బుట్ట తెరిచి కూర్చున్నారు. ఆ సినిమా ఆర్ధికసారం ఏంతవరకు జుర్రేయవచ్చో - అక్కడే పాగా వేసే కొత్త పదకానికి తెరతీసారు దిల్ రాజు & కంపనీ.

నిర్మాతగా, పంపైణీదారుడుగా, ప్రదర్శకుడుగా మూడు రంగాలపై తన ఉడుంపట్టు బిగించారు. అయితే ఇక్కడ చాలా మందికి తెలియనిది ఏమిటంటే, నిర్మాతగా ఎలా వున్నా, డిస్ట్రిబ్యూటర్ గా, ఎగ్జిబిటర్ గా దిల్ రాజు వెనుక వున్న పెద్ద పెద్దతల “శిరీష్ రెడ్డి - ది మోస్ట్ ఎరగెంట్, హేడ్ స్ట్రాంగ్” అని ముందే చెప్పుకుంటే బెటర్ అని ఒక నిర్మాత కఠువుగానే చెప్పారు.

 
చాలా కఠినంగా, నిర్ధాక్షిణ్యంగా, పట్టుదలతో, వ్యాపారమే పరమార్ధంగా వ్యవహరిస్తారని శిరీ ష్ రెడ్డికి పేరుంది. దిల్ రాజు అనే ఒక హృద్యమైన తెరవెనుక ఈ కార్యక్రమాల చక్రం తిప్పేది శిరీష్ రెడ్డి మాత్రమే అని సినిమా జనాలు చెపుతున్నారు. తెలంగాణాలో థియేటర్లు అన్నితన  చేతిలో ఉంచుకున్న “ ఏషియన్” ఓనర్ సునీల్, సురేష్ ప్రొడక్షన్స్ సురేష్ బాబు, అల్లు సంస్థాన ప్రతినిధులు కూడా శిరీష్ ఆఫీసు చుట్టూ తిరగాలి తప్ప, వాళ్ల దగ్గరకి ఈ “దొర” (తెలంగాణాలో నైజాం కాలం నాటి పాలకుల ప్రతినిధులను ఇలా అంటారు) వెళ్ళేది గాని, సంప్రదించేది గాని లేదు. అంతా స్థానబలం. తెలంగాణా ఉద్యమ సమయంలో టాలీవుడ్ లో మరీ తన ఉడుంపట్టు బిగించారు.

బిగిసిన పిడికిలి కాదు, వ్యాపార మాయోపాయ కోణంతో, బిగించిన పిడికిలి ఎప్పుడో అప్పుడు బలహీనమవటం తప్పదు అన్నట్లు ఇప్పుడు ఒక్కసారి గా ఈయనలోని “దృతరాష్ట్రత్వం” పరాకాష్టకు చేరి లావా పెల్లుబికింది. సాగరతీరం చెలియలి కట్ట దాటే రోజు ఎప్పుడో రాక తప్పదు. అదే జరిగింది. జనాగ్రహ విస్పోఠనం అయింది.

ఆ నలుగురు కలయిలో ఏర్పడ్డ ఐఖ్యతలోని లుకలుకలు బయటకు తెలియటంలో - రెండు విపరిణామాలు సంభవించాయి. 'నిర్మాతల కౌన్సిల్ కు పోటీగా ఈ చతుష్టయం నిర్మించిన నిర్మాతల గిల్డ్' అనేది శిరీష్ లాంటివాళ్ళ కారణంగానే కట్టు పట్టు రెండూ తప్పుతోందన్న జనవాణి నేడు టాలీవుడ్ లో ప్రతిధ్వనిస్తుంది.

ఈ మద్యే, నిజం గ్రహించి జూలు విదిల్చిన దగ్గుబాటి, అల్లు, ఏసియన్ లు ఐఖ్యంగా ఇకపై శిరీష్ కార్యాలయం చుట్టూ ప్రదక్షణలు చేయటానికి స్వస్తి పలకాలని వారు తమ తమ కీలక సిబ్బందికి ఆదేశాలు జారీచేశారన్న విషయం టాలీవుడ్ లో వైల్డ్-ఫైర్ లా వ్యాపించింది. అంతే కాదు, తమ సిబ్బంది కొందరు శిరీష్ రెడ్డితో కుమ్మక్కై కొన్నివ్యాపార వ్యతిరేఖమైన పనులు చేస్తున్నారని, ఇక నుండి థియేటర్ల వ్యవహారాలను తానే స్వయంగా పర్యవేక్షిస్తానని సురేష్ బాబు & కంపనీ నిర్ణయించుకున్నారని వార్తలు షికార్ చేస్తున్నాయి.

వివిధ ప్రాంతాల మేనేజర్లకు నిర్ణయాధికారాలు పెంచి, ఉన్నతస్థాయి ఉద్యోగులకు అధికారాలు కత్తిరించి నామమాత్రంగా ఉంచుతున్నారని
టాలీవుడ్ ఉవాచ. నిజానిజాలు ఎలా వున్నా, టాలీవుడ్ అంతర్గత వ్యవహారాలు ఇప్పటికైనా భళ్ళుమన్నాయి. వరంగల్, డిస్ట్రిబ్యూటర్ శ్రీను పలు పరిశోధనల తరవాత ాజికల్ పాయింట్లను బయటకు గుంజి, సాక్ష్యాదారాలతో సహా తెలంగాణ ప్రొడ్యూసర్ల గిల్డ్ లో జరుగుతున్న  ఆధిపత్య పోరును బట్టబయలు చేశారు. దీంతో ఈ కంపంతా సాధారణ జనాలకు కూడా తెలిసింది, ఎంతగానంటే “ఫిల్మ్-నగర్ లో చాయ్ అమ్మే వాళ్ళు  కూడా చర్చింతేటంతగా"

“దిల్ రాజు ఒక కిల్ రాజు” అంటూ తీవ్ర పద ప్రయోగంతో ధారుణంగా విమర్శించారు వరంగల్ డిస్ట్రిబ్యూటర్ సీను అంటున్నారంతా. దీంతో ఎంతో కొంత సున్నిత మనస్కుడైన “దిల్ రాజు” మనసు క్షోభించి తీవ్రంగా బాధపడ్డారని తెలిసింది. దాదాపు రెండు దశాబ్ధాలుగా తాను కష్టపడి నిర్మించుకున్న కీర్తి ప్రతిష్టల సౌధం ఈ శిరీష్ రెడ్డి లాంటివాళ్ళంతా కలసి, కూకటివేళ్ళతో పెకిలించి కూల్చేశారని ఆయన తన సన్నిహితుల దగ్గర వాపోయినట్లు తెలుస్తుంది.

అత్యల్ప విషయాలకు, తన దగ్గరకు స్వల్పస్వల ప్రయోజనాలు లేదా సహాయాలు ఆశించి వచ్చే చిన్న చిన్న వ్యక్తులపై కూడా “ఇగోలు” ప్రదర్శించే వారి పంతాల వలననే ఇంత విధ్వంసం జరిగిందని, గతమంతా దిల్ రాజు టాలీవుడ్ కు చేసిన సేవలు, మంచి పనులు, నిర్మాతల నందరిని ఒకే వేదికపైకి తీసుకువచ్చి, ప్రణాళికాబద్ధంగా సినిమాలను విడుదల చేసే తన విధానాలన్నీ పూచిక పుల్లలై వృధాగా   పోయాయని ఆయన తీవ్ర వేధపడుతున్నట్లు తెలుస్తోంది.

'దిల్ రాజు చాలా బాధపడుతున్నారు. తన పేరు అంతా పాడయిందని ఫీలవుతున్నారు. పాపం ఇందులో ఆయన తప్పు కన్నాతన వాళ్ళ కొందరి  పంతం ఎక్కువగా వుంది. కానీ దానికి దిల్ రాజుకు చెడ్డ పేరు వచ్చింది” అని ఒక నిర్మాత అన్నారు.

ఇప్పుడు దిల్ రాజు వారి నీడకూడా పడనంత దూరంపెట్టి, కార్యనిర్వాహణ భారం వహించటం తన స్వంత కుటుంబసభ్యులకు అలవాటు చేస్తే మంచిది. పెద్ద పెద్ద వ్యాపారాల సామ్రాజ్యాలు కూలేది పిదప బుద్దులున్న లాంటి వాళ్ళ వలననే "దిల్ ఉన్న దిల్ రాజు" గ్రహించటం ఇప్పటికైనా మంచిది. శిరీష్ స్థానంలో జీతంతో పనిచేసే నిబద్ధులకు ఒప్పజెబితే మంచిది.  

“మీడియా కూడా ఇప్పుడు “దిల్ రాజు మీద నుండి ఫోకస్” షిఫ్ట్ చేసి ఇగోయిష్టుల వెషాలు బయట పెడితే బాగుంటుంది. ఇలా అయిందానికి కాని దానికి ఎక్కడో విభిన్న భాధ్యతలు వహించే, ఎంతో కొంత మంచి వాడైన దిల్ రాజును టార్గెట్ చేయటం వలన - అహంభావం, అహకారం తో అసలు వ్యవస్థలను కూల్చేవారు తప్పించు కుంటారు” అని మరో నిర్మాత అన్నారు.

"ఇప్పుడు మీడియా అర్ధం చేసుకోవాల్సింది ఒకటుంది అదే - థియేటర్లు అన్నీ నియంత్రించి, నిర్వహించేది దిల్ రాజు కాదు, టలీవుడ్ లోనే దిల్ రాజు నీడలో పైకి వచ్చిన శిరీష్ రెడ్డి అన్న సంగతి పరిశ్రమలో ఉన్న చానా మందికి తెలియదు. ఒక్కసారి శిరీష్ రెడ్డిని కలిసి చూడండి ఆయన స్వభావం మీకు అర్ధం అవుతుంది. ఎక్కువ సమయం పట్టదు" అని ఒక చిన్న డిస్ట్రిబ్యూటర్ అన్నారు.

ఒక అద్భుతమైన సినిమా తీసిన ఒక నిర్మాత సినిమా విడుదల చేసుకోలేక, "ఆ నలుగురు" లో ఒక మహా ప్రొడ్యుసర్ దగ్గరకు వెళ్ళి కారుచౌకకు సినిమాను అమ్మెసుకొని బయటపడ్డారట. ఆ తరవాత ఆ సినిమా విడుదలచేసి కోటానుకోట్లు సంపాదించారట. ఒక మంచి నిర్మాత సినిమా పాషన్ గంగలో కలిసింది. ఇలా చిన్న చిన్న నిర్మాతలను సినీరంగానికి చేరువ కాకుండా చేసే కార్యక్రమం నడుస్తుందట..  

మొత్తం మీద డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను ఉదంతం టాలీవుడ్ లో కొంగ్రొత్త ఆలోచనలకు, నిర్ణయాలకు, సమీకరణలకు, కొత్త సినిమా వ్యాపార వ్యూహాలకు తెరతీస్తున్న వాతావరణం కనిపిస్తుంది.

“దిల్ రాజు ఒక కిల్ రాజు” అంటూ తీవ్ర పద ప్రయోగంతో ధారుణంగా విమర్శించారు వరంగల్ డిస్ట్రిబ్యూటర్ సీను అంటున్నారంతా. దీంతో ఎంతో కొంత సున్నిత మనస్కుడైన “దిల్ రాజు” మనసు క్షోభించి తీవ్రంగా బాధపడ్డారని తెలిసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: