యంగ్ హీరో నాగ శౌర్య వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. విల్లుకారుడిగా కనిపిస్తున్న 'లక్ష్య'మూవీ రిలీజ్‌కు రెడీగా ఉంది. లవ్‌ అండ్‌ రొమాంటిక్‌ సినిమా 'వరుడు కావలెను' సెట్స్‌పై ఉండగానే.. అనీష్ కృష్ణ దర్శకత్వంలో సినిమా మొదలుపెట్టాడు. హీరో నటించే 23వ సినిమాను టైటిల్‌తో సహా ఎనౌన్స్‌ చేసేశాడు. 'పోలీస్‌ వారి హెచ్చరిక' అనే డిఫరెంట్ టైటిల్‌తో వస్తున్నాడు ఈ యంగ్ హీరో.

యంగ్ హీరో నాగ శౌర్య నటిస్తున్న స్పోట్స్‌  డ్రామా 'లక్ష్య'. విలువిద్య బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న తొలి తెలుగు సినిమా ఇదే. దీరేంద్ర సంతోష్‌ దర్శకుడు కాగా.. శరత్‌మరార్‌.. నారాయణదాస్‌ నారంగ్‌  రామ్మోహనరావు కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నారు.  నాగశౌర్య బర్త్‌డే స్పెషల్‌గా జగపతిబాబు వాయిస్‌ ఓవర్‌తో వచ్చిన టీజర్‌ ఆకట్టుకుంది. 'పడిలేచినవాడితో పందెం' చాలా ప్రమాదకరం అన్న డైలాగ్‌తో  స్టోరీ ఎలా వుంటుందో చెప్పేశాడు దర్శకుడు. విలు విద్యలో టాపర్‌ అయిన హీరో అనివార్య కారణాల వలన వెనుకపడిపోయి... మళ్లీ సత్తాచాటడంతో 'లక్ష్యం' నెరవేరుతుందన్నమాట.

చేతినిండా సినిమాలతో ఉన్న నాగశౌర్య లక్ష్య టీజర్‌తోపాటు.. వరుడు కావలెను మూవీ సెకండ్ గ్లిప్సీతో వచ్చాడు. ఫస్ట్‌ గ్లిప్సీ మాదిరి ఇది కూడా ఆకట్టుకుంది.  సూట్‌ వేసుకుని.. పెళ్లి చూపులకు బయలుదేరాడా? అనట్టు.. డిజైన్‌ చేశారు దర్శకురాలు లక్ష్మీ సౌజన్య.

లక్ష్య టీజర్.. వరుడు కావలెను సెకండ్‌ గ్లిప్సీ చూస్తుంటే.. కామన్‌ ఒక పాయింట్‌ ఉంది. లక్ష్య కోసం సిక్స్‌ ప్యాక్‌ పెంచిన నాగశౌర్య టీజర్‌ చివరల్లో చొక్కా లేకుండా కనిపించాడు. వరుడు కావలెను గ్లిప్సీ మొదట్లోనే బాడీ చూపించి... కష్టాన్ని ఆవిష్కరించాడు హీరో.

నాగశౌర్య నటిస్తున్న ఐదు సినిమాల్లో 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి'  కూడా ఒకటి. 'ఊహలు గుసగుసలాడే' 'జ్యో అచ్యుతానంద'  హిట్స్‌ తర్వాత నాగశౌర్య, దర్శకుడు అవసరాల శ్రీనివాస్‌ కాంబోలో తెరకెక్కతున్న ఈ సినిమాను పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ,  దాసరి ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్నాయి. కల్యాణ్‌ వైభోగమే తర్వాత మాళవికా నాయర్‌ నాగశౌర్యతో మరోసారి జత కడుతోంది. హీరో పుట్టినరోజు సందర్భంగా.. మేకింగ్‌ వీడియో రిలీజ్‌ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: