పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా యంగ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా వకీల్ సాబ్. తొలిసారిగా దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా పవన్ కళ్యాణ్ ఇందులో పవర్ఫుల్ లాయర్ పాత్ర పోషిస్తున్నారు. ప్రకాష్ రాజ్, మురళి శర్మ, అంజలి, నివేదా థామస్, అనన్య తదితరులు కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందిస్తుండగా ప్రముఖ ఛాయాగ్రాహకుడు పి.ఎస్.వినోద్ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు.

ఇటీవల పవన్ జన్మదినం సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్, అలానే కొద్ది రోజుల క్రితం రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్ కి కూడా పవన్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియన్స్ నుంచి విపరీతమైన స్పందన లభించింది. ఇటీవల బాలీవుడ్ లో రిలీజ్ అయి మంచి సక్సెస్ సాధించిన కోర్ట్ డ్రామా మూవీ పింక్ కి అధికారిక తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న వకీల్ సాబ్ వేసవి కానుకగా రిలీజ్ కానుంది. ముఖ్యంగా ఈ సినిమా నుండి ఇటీవల రిలీజ్ అయిన మగువా మగువా అనే లిరికల్ సాంగ్ శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంది.

ఇక అసలు మ్యాటర్ ఏంటంటే వకీల్ సార్ మూవీ నుండి అతి త్వరలో విజిల్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ని పవన్ ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా అతి త్వరలో రిలీజ్ చేయబోతున్నాం అంటూ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కొద్దిసేపటి క్రితం తన సోషల్ మీడియా అకౌంట్స్ లో ఒక పోస్ట్ పెట్టారు. తప్పకుండా ఈ మ్యూజిక్ రింగ్ టోన్ మిమ్మల్ని అందరిని అలరిస్తుందనే నమ్మకం ఉంది అంటూ థమన్ పెట్టిన పోస్టు ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతుంది. కాగా పవన్ ఫ్యాన్స్ తమన్ పోస్టుపై స్పందిస్తూ, మేమందరం దాని కోసమే వెయిటింగ్ త్వరగా రిలీజ్ చేయండి అంటూ మీడియా మాధ్యమాల్లో ఆయనకు రిప్లై ఇస్తున్నారు. ఇప్పటికే ఆల్మోస్ట్ షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న సినిమా తప్పకుండా రిలీజ్ తర్వాత మంచి సక్సెస్ అందుకుని పవన్ కెరీర్ కి పెద్ద బ్రేక్ ఇవ్వడం ఖాయమని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: