నందమూరి కళ్యాణ్ రామ్ టైమ్ అస్సలు బాలేదు. అప్పుడెప్పుడో అనిల్ రావిపూడి తో చేసిన పటాస్ సినిమా హిట్ తర్వాత ఈయనకు మరో సినిమా హిట్ పడలేదు. మధ్యలో కొన్ని రొటీన్ సినిమాలు, కొన్ని ప్రయోగాత్మక సినిమాలు చేసినా ఈయనకు మాత్రం లక్ కలిసి రాలేదు. అయితే ఈయన తాజాగా విడుదలైన క్రాక్ సినిమాని అనుకోకుండా వదులుకోవాల్సి వచ్చిందట. ఈ విషయానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే నిజానికి ఈ కథను ముందుగా గోపీచంద్ మలినేని వెంకటేష్ వద్దకు తీసుకు వెళ్లారట. కానీ ఆయన ఒప్పుకోకపోవడంతో రవితేజ వద్దకు తీసుకువెళ్ళాడు. ముందుగా రవి తేజకు కూడా కథ పెద్దగా నచ్చలేదట.. ఆ తరువాత ఈయన కథను కళ్యాణ్ రామ్ వద్దకు తీసుకు వెళ్ళాడు అని అంటున్నారు. కళ్యాణ్ రామ్ కి కథ నచ్చడంతో సినిమా చేద్దామని అన్నాడట. 


అయితే కళ్యాణ్ రామ్ సినిమా చేద్దాం అన్న విషయం రవితేజకి తెలిసి తానే ఈ సినిమా చేస్తానని మళ్లీ గోపీచంద్ వెనక్కి వినిపించాడట. అయితే అప్పటికే కల్యాణ్ రామ్ సినిమా చేస్తానన్నా మొదటి సారి తనకు డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చిన రవితేజ మాట కాదనలేక ఆయనతోనే సినిమా చేశాడు. ఇక ఈ సినిమా రిలీజ్ కావడం సంక్రాంతి సందర్భంగా పెద్ద హిట్ గా నిలవడం తెలిసిందే. ఒక రకంగా ఈ సినిమా 50 శాతం సీట్లతో 50 కోట్ల క్లబ్ లో చేరింది. 


ఇంకా దీనికి సాటిలైట్ అలాగే డిజిటల్ రైట్స్ అదనం. అలా ఒక రకంగా ఇప్పుడు సినిమాలు రిలీజ్ చేస్తే కలెక్షన్స్ వస్తాయా రావా అని మీమాంస లో ఉన్న అన్ని సినిమాల నిర్మాతలకు ఈ సినిమా ఒక రకమైన దిక్సూచిగా నిలిచింది. ఈ సినిమాలో రవితేజ యాక్షన్ శృతిహాసన్ ఫైట్స్  తమన్ అందించిన ఆర్.ఆర్ హైలెట్ అని చెప్పవచ్చు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో బాలీవుడ్లో కూడా రీమేక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: