పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ ఏ రేంజ్ లో హిట్ అవుతుంది అన్న అంచనాలు ఇప్పటి నుంచే మొదలయ్యాయి. పవన్ వరసపెట్టి సినిమాలు ఒప్పుకుంటున్న పరిస్థితులలో ‘వకీల్ సాబ్’ కు వచ్చే కలక్షన్స్ ను బట్టి పవన్ భవిష్యత్ సినిమాల మార్కెట్ ఆధారపడి ఉంటుంది. దీనికితోడు ధియేటర్లలో 100 % ఆక్యుపెన్సీ వచ్చిన తరువాత విడుదల అయ్యే మొట్టమొదటి టాప్ హీరో సినిమా ‘వకీల్ సాబ్’ కావడంతో ఈమూవీ పై ఇండస్ట్రీ వర్గాలు కూడ చాల ఆశక్తిగా ఎదురు చూస్తున్నాయి.


సినిమా సక్సస్ కు మారుతీ గోపీచంద్ ల కాంబినేషన్ మూవీకి ఒక లింక్ ఉంది అన్న ప్రచారం జరుగుతోంది. తెలుస్తున్న సమాచారంమేరకు గోపీ చంద్ మారుతీల సినిమాలో కూడ పవర్ ఫుల్ కోర్టు సీన్స్ ఉంటాయని వార్తలు వినిపిస్తున్నాయి. గోపీచంద్ మొదటిసారిగా తన కెరియర్ లో ఈమూవీలో లాయర్ గా కనిపించబోతున్నాడు.


గతంలో సగటు ప్రేక్షకులు కోర్టు సీన్స్ లో హీరోలు చెప్పే భారీ డైలాగ్స్ ను బాగా ఎంజాయ్ చేసేవారు. అయితే ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచి మారిపోవడంతో అలాంటి డైలాగ్స్ ను పెట్టడం దర్శకులు తగ్గించివేసారు. అయితే మళ్ళీ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ ద్వారా కోర్టు సీన్స్ లో వచ్చే ఎమోషనల్ డైలాగ్స్ హవా ప్రారంభం కాబోతున్న పరిస్థితులలో ఆమూవీకి సగటు ప్రేక్షకుడు నుండి వచ్చే స్పందన బట్టిమారుతీ గోపీచంద్ మూవీలో కోర్టు సీన్స్ డ్రామా ఎక్కువగా పెట్టాలా లేక తక్కువగా పెట్టాలా అన్నవిషయం తేల్చుకోవాలని మారుతీ ఆలోచనలు చేస్తున్నట్లు టాక్.


మారుతీ రెడీ పెట్టుకున్న ఈ కథ సమాజంలో జరిగిన ఒక అన్యాయం చుట్టూ తిరుగుతుందని వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఇలాంటి యదార్థ సంఘటనలతో సినిమాలు తీసినప్పుడు పేపర్లలో వచ్చిన న్యూస్ ను మళ్ళీ సినిమాగా చూడాలా అంటు చాలామంది ప్రేక్షకులు పెదవి విరిచారు. దీనితో స్త్రీల పై జరుగుతున్న అత్యాచారాల చుట్టూ అల్లుకున్న ‘వకీల్ సాబ్’ విజయం మారుతీకి అదృష్టంగా మారుతుంది..  

మరింత సమాచారం తెలుసుకోండి: