ప్రపంచ నంబర్ వన్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఏదీ అంటే ఎవరైనా వెంటనే నెట్ ఫ్లిక్స్ పేరు చెపుతారు. ఈ ర్యాంకింగ్ విషయంలో ఎవరికి ఎటువంటి సదేహాలు లేవు. అయితే నెట్ ఫ్లిక్స్ తెలుగులో తన ఒరిజినల్ కంటెంట్ తీసుకురావడానికి గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టింది.

సంచలనాలు సృష్టించిన ‘లస్ట్ స్టోరీస్’ వెబ్ సిరీస్ ను తెలుగులో ‘పిట్ట కథలు’ పేరుతో ఒరిజనల్ కంటెంట్ గా నెట్ ఫ్లిక్స్ తన తొలి తెలుగు వెబ్ సిరీస్ ను నిర్మించింది. ఫిబ్రవరి 19 నుండి స్ట్రీమ్ కాబోతున్న ఈ వెబ్ సిరీస్ లో శ్రుతి హాసన్ అమలా పాల్ ఈషా రెబ్బా మంచు లక్ష్మి జగపతిబాబు సత్యదేవ్ లాంటి ప్రముఖ తారాగణం నటిస్తున్నారు.

ఈ సిరీస్ కు నాగ్ అశ్విన్ తరుణ్ భాస్కర్ నందిని రెడ్డి సంకల్ప్ రెడ్డి లాంటి ప్రముఖులు దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్  చాల బోల్డ్‌ గా ఉంటుందని అంచనాలు వస్తున్నాయి. ఈ వెబ్ సిరీస్ ను ప్రచారం కోసం సోషల్ మీడియాలో విపరీతంగా హడావిడి చేస్తోంది. ఈ వెబ్ సిరీస్ గురించి అంచనాలు పెంచుతూ నెట్ ఫ్లిక్స్ అనేక హ్యాష్ టాగ్స్ కూడ క్రియేట్ చేసి తమది ఒరిజనల్ కంటెంట్ అంటూ ప్రచారం చేస్తోంది.


దీనితో ఈ ప్రచారం ఆహా నిర్వాహకులకు ఏమాత్రం నచ్చలేదు. ఇలాంటి పరిస్థితులలో ఆహా టీమ్ రంగంలోకి దిగి ‘నెట్ ఫ్లిక్స్’ చేస్తున్న ‘ఒరిజినల్ త్వరలో మీ ముందుకు’ అన్న కామెంట్ తో కూడిన ప్రచారానికి అడ్డుకట్ట వేస్తూ ‘మా దగ్గర చాలా ఒరిజినల్స్ ఉన్నాయి అరుస్తున్నామా’ అంటూ ఆహా టీమ్ కౌంటర్ ఎటాక్ ప్రారంభించింది. అన్నీ తెలుగు కార్యక్రమాలు సెలెబ్రెటీ షోలు కొత్త సినిమాలు ఉండే ఓటీటీ సంస్థగా ఆహా ఇప్పటి వరకు చేసిన ప్రచారానికి చెక్ పెట్టడానికి ఏకంగా నెట్ ఫ్లిక్స్ రంగంలోకి దిగడంతో రానున్న రోజులలో ఆహా కు గట్టి పోటీ తప్పదు అనుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: